Mana Shankara Varaprasad Garu: ఈ సంక్రాంతికి వార్ వన్ సైడ్ అన్నట్టు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ‘ఓజీ’ చిత్రం ముందు వరకు కూడా మెగా ఫ్యాన్స్ చాలా నిరాశతో ఉండేవారు. ఎందుకంటే మెగా హీరోల చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. కానీ ఓజీ చిత్రం భారీ విజయం సాధించడం, ఈ సినిమా విడుదలైన నాలుగు నెలలకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూపం లో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడం వంటివి మెగా ఫ్యాన్స్ కే మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 300 కోట్ల దగ్గర ఆగుతుందా?, లేదా 400 కోట్ల వద్ద ఆగుతుందా అనేది చూడాలి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా భారీ విజయం సాధించడం మెగా ఫ్యాన్స్ కి ఎంత ఆనందంగా ఉందో, అంతకు పది రెట్లు ఆనందం మెగాస్టార్ చిరంజీవి కి ఉంది. నిన్న రాత్రి చిరంజీవి ఈ మూవీ సక్సెస్ అయినందుకు ఒక స్టార్ హోటల్ లో సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఈ సక్సెస్ పార్టీ కి మూవీ టీం తో పాటు, విక్టరీ వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చారు. వీళ్లంతా సంతోషంతో చిందులు వేస్తూ, కేక్ కటింగ్ చేసుకుంటూ సంబరాలు చేసుకునే విధానాన్ని చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. వీడియో చివర్లో చిరంజీవి ‘ఏందీ వెంకీ సంగతి’ అని అనడం, అందుకు వెంకటేష్ ‘అదిరిపోయిందిగా సంక్రాంతి’ అంటూ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి .
ఇకపోతే ఈ సినిమాకు టికెట్స్ దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. ప్రధాన నగరాల్లో ఒక్కటంటే ఒక్క థియేటర్ లో కూడా ఈ నెల 17 వరకు టికెట్స్ లేవు. ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్స్ ఆబ్లిగేషన్స్ తో తమ సర్కిల్ లో పెద్దవారిని సంప్రదిస్తున్నారు. అయినప్పటికీ కూడా టికెట్స్ దొరకడం కష్టమవుతుంది. ఇలా ఒక సినిమాకు వరుసగా నాలుగైదు రోజులు టికెట్స్ బుక్ అవ్వడం అనేది మనం చూసి దశాబ్దాలు దాటింది. చిరంజీవి తనలోని వింటేజ్ నటన ని మాత్రమే కాదు, తన పాత సినిమాలకు తన స్టార్ స్టేటస్ ఎలా ఉండేదో నేటి తరం యువత కి ఈ సినిమా ద్వారా ఒక డెమో వేసి చూపించాడు. ఇప్పుడే ఇలా ఉందంటే , ఆరోజుల్లో చిరంజీవి సూపర్ స్టార్ స్టేటస్ ఎలా ఉండేదో మీరే ఊహించుకోండి. ఇక ఈ చిత్రం వసూళ్లు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది చూడాలి.
