US Attack On Iran: ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభంతో సుమారు 20 రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవోల్బణం, డారల్‌తో రియాల్ విలువ భారీగా పతనం కావడంతో నిత్యావసర ధరలు ఇరాన్‌లో భగ్గుమంటున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం నిరసనలను అణచివేస్తోంది దీంతో వందల మంది మరణించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనలకు మద్దతు తెలిపారు. నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆర్థికసాయం చేస్తామని ప్రకటించారు. నిరసనలను అణచివేస్తే దాడి చేస్తామని ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో భారత రాయబార కార్యాలయం స్థానిక పౌరులకు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. విదేశాంగ శాఖ తాత్కాలిక ప్రయాణ నిషేధం ప్రకటించింది.
హింసాత్మక ప్రదర్శనలు
దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసలు 2,500 మంది మరణాలకు కారణమయ్యాయి. ఆర్థిక సమస్యలు, రాజకీయ అసంతృప్తి ఇందుకు కారణం. భద్రతా సైన్యాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి, దీనితో ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇక మరోవైపు అమెరికా ఇరాక్ సమీపంలో సైనికులను మోహరించింది. అత్యాధునిక డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసింది. దీంతో ఏ క్షణమైనా ఇరాన్‌పై దాడి చేసే ప్రమాదం ఉంది.
భారతీయులకు సూచనలు
రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. హింసాపూరిత ప్రాంతాలను వీడాలని ఆదేశించింది. ఎంబసీతో సహకారం పెంచాలి. ప్రయాణ డాక్యుమెంట్లు సిద్ధపరచాలి సూచించింది. స్వదేశానికి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. అందుబాటులో ఉన్న ట్రాన్స్‌పోర్ట్ ద్వారా త్వరగా రాకాలని కోరింది. అనవసర ప్రయాణాలు ఆపేయాలని స్పష్టం చేసింది. ఇరాన్‌లో వేలాది భారతీయులు పని, విద్య కోసం ఉన్నారు. ఎవాక్యుయేషన్ ప్రణాళికలు సిద్ధంగా ఉండాలి.