Mana Shankara Varaprasad Garu Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో అత్యంత గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి తో పాటు, విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కూడా వచ్చాడు. ఈ చిత్రం లో వెంకటేష్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సంక్రాంతికి ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.
ఇకపోతే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ ‘ హలో మెగా విక్టరీ ఫ్యాన్స్..జోష్ ఏది అమ్మా..మీరు అరిచే అరుపులు ఇక్కడ వరకే కాదు, మీ ఇంటి వరకు వినపడాలి. మీ ఇంట్లోని అమ్మా, నాన్న, తాత, అక్క,అన్నా, అవ్వ, చెల్లి, ఇలా ప్రతీ ఒక్కరు వినాలి, మరి ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళే అమ్మా. మన చిరంజీవి గారు రఫ్ఫాడించే సినిమాలు ఎన్నో చేశారు. నేను కూడా ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసాను. అప్పట్లో నేను, మా బాస్ కలిసి బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించేసాము, ఇప్పడు కలిసి రాబోతున్నాము. ప్రతీ సంక్రాంతి లాగానే, ఈ సంక్రాంతికి కూడా రాబోయే ప్రతీ సినిమాని సక్సెస్ చెయ్యండి’ అంటూ చెప్పుకొచ్చాడు విక్టరీ వెంకటేష్. ఆయన మాట్లాడింది కేవలం మూడు నిమిషాలే అయినప్పటికీ, ఫ్యాన్స్ లో నరనరాల్లో ఎనర్జీ ని నింపే రేంజ్ లో మాట్లాడాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అప్పుడు మా తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు తో కలిసి సినిమాలు చేసాను, ఇప్పుడు మా అన్నయ్య తో కలిసి వస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ము ఈవెంట్ లో వెంకీ చేసిన సందడి మామూలు రేంజ్ లో లేదు. ముఖ్యంగా ‘హుక్ స్టెప్’ పాటకు అభిమానులంతా ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా చేస్తుంటే, వెంకటేష్ వాళ్ళతో పాటు వైబ్ అవుతూ డ్యాన్స్ వేసిన వేయడం హైలైట్ గా నిల్చింది. వెంకటేష్ ప్రతీ ఈవెంట్ లో ఇంతే ఎనర్జీ తో ఉండే విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని ఈవెంట్స్ లో పద్దతి గా ఉండాలి కాబట్టి సైలెంట్ గా ఉంటాడు కానీ, సందడి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వెంకటేష్ ని మించిన ఎనర్జీ తో ఎవ్వరూ ఉండలేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అభిమానులను ఉర్రూతలూ ఊగించిన వెంకటేష్ స్పీచ్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.
