RK Kottapaluku: పాత్రికేయులు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుతుంటారు. కానీ, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ(vemuri Radhakrishna) మాత్రం ఈ పరిధిలోకి రారు. ఈ విషయం అయినా సరే ఆయన దాచుకోరు. ఎటువంటి మొహమాటలు లేకుండా బయటపెడుతుంటారు. ఇప్పుడు అమరావతి విషయంలో రాధాకృష్ణ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
ఇటీవల వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సో కాల్డ్ రాజధాని అంటూ విమర్శలు చేశారు. సహజంగా ఇటువంటి విమర్శలను సాక్షి కార్నర్ చేస్తుంది. కానీ, ఆంధ్రజ్యోతి అలా కాదు కదా.. జగన్ చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ కథనాలను ప్రసారం చేసింది. వాటితోనే ఆగిపోక ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాటి కొత్త పలుకులో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ ను కలిపి విమర్శించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలోకి రాలేదని.. ప్రగతి భవన్ కేంద్రంగానే ఆయన సమీక్షలు, సమావేశాలు నిర్వహించే వారని.. ఆయన ఎక్కడ ఉంటే అదే సచివాలయం అనే వారిని రాధాకృష్ణ గుర్తు చేశారు. అంతేకాదు, నది ఒడ్డున ఉన్న అమరావతి మీద జగన్ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారని.. లండన్ నుంచి మొదలుపెడితే పారిస్ వరకు ప్రతి రాజధాని నది ఒడ్డున లేదా అంటూ రాధాకృష్ణ గుర్తు చేశారు. మొత్తంగా కెసిఆర్, జగన్ ను కలిపి విమర్శించారు. తద్వారా రాజధాని పట్ల జగన్ కున్న వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
అమరావతి విషయం రాసుకుంటూ రాధాకృష్ణ ఒక విషయాన్ని బయటపెట్టారు. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో ఆగ్రహం ఉండడానికి ప్రధాన కారణం ఒక కులం అని.. ఆ కులం వారు అమరావతిలో ఎక్కువగా ఉన్నారని జగన్ కోపమని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఒకవేళ అమరావతిలో ఆ కులం వారు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రోజులు గడిచేకొద్దీ ఆ కులం వారి ఆధిపత్యం తగ్గిపోతుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీనికి హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా చూపించారు. ఆ తర్వాత అమరావతి నగరం అభివృద్ధి చెందుతుందని.. కాకపోతే హైదరాబాద్ స్థాయిలో డెవలప్ కాలేదని రాధాకృష్ణ సంచలన విషయాన్ని ప్రకటించారు. అంటే అమరావతి నగరంలో ఆ కులం వారి ఆధిపత్యం ఉందని, ఆ నగరం హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి కాలేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు.
మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసిపి వాళ్ళు ఎలా ఊరుకుంటారు? సో కాల్డ్ క్యాపిటల్ అని జగన్ విమర్శించినప్పుడు భూతద్దం పెట్టి చూసిన రాధాకృష్ణ.. తను అమరావతిలో ఒక కులం వారు ఎక్కువగా ఉన్నారని, హైదరాబాద్ నగరం స్థాయిలో అభివృద్ధి చెందదని అన్నప్పుడు.. వైసిపి వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు.. అందుకే పాత్రికేయులు ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాధాకృష్ణ లాంటి సీనియర్ పాత్రికేయులు మరింత జాగ్రత్తగా ఉండాలి.. అమరావతికి ఏదో పాజిటివ్ బూస్ట్ ఇద్దామని రాధాకృష్ణ ప్రయత్నిస్తే.. చివరికి అది ఇలా కులం, డెవలప్ అనే విషయంలో బూమారాంగ్ అయింది.