Mana Shankara Varaprasad Garu: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అంటూ తన అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని వెంకటేష్ వచ్చిన తర్వాతే సినిమాలో అసలైన మలుపులు తిరుగుతాయని, వెంకీ తోనే కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరోని పెట్టుకొని వెంకటేష్ తో సినిమాను నడిపించిన అనిల్ రావిపూడి విషయంలో మెగా అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడనున్న నేపథ్యంలో ఇప్పటికే దుబాయిలో ఈ సినిమాను చూసిన చాలా మంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎప్పుడు ఉండే రొటీన్ తరహా కథని ఈ సినిమాలో ఎంచుకున్నాడని ఇందులో పెద్దగా వైవిధ్యం ఏముందని చెబుతున్నారు.
ఆ మాత్రం దానికి మెగాస్టార్ చిరంజీవిని ఇందులో భాగం చేయాల్సిన అవసరం ఏముందని కూడా వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి చేసిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ తప్ప ఎవరిని పెద్దగా మెప్పించలేదు. మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని సినిమాని తీసుకొచ్చాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ అతనికి అభిమానులే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ సినిమా కనెక్ట్ అవ్వాలి.
అలాకాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కే కనెక్ట్ చేస్తాము అంటే మిగతా ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ప్రీమియర్ షో పడితేగాని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే విషయంలో క్లారిటీ రాదు…