The Raja Saab Hindi Version Collections: మన టాలీవుడ్ నుండి నేటి తరం లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) మాత్రమే. బాహుబలి సిరీస్ తో ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలో ఏ నిర్మాత అయినా ప్రభాస్ పై కళ్ళు మూసుకొని 500 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేయగలరు. ఎందుకంటే హిట్ అయితే అవలీల గా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టార్ స్టేటస్ ఆయనకు ఉంది కాబట్టి. అలాంటి హీరో చిన్న సినిమాలు తీసుకునే మారుతి లాంటి డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. దానిని సరిగా ఉపయోగించుకుంటే ఓవర్ నైట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయే అద్భుతమైన అవకాశం మారుతీ కి ఉండేది. కానీ రాజా సాబ్(The Rajasaab Movie) తో ఆయన అది నిరూపించుకోలేకపోయాడు.
మొదటి రోజు బాలీవుడ్ లో 30 కోట్ల రూపాయిల నెట్ ఓపెనింగ్ పెట్టేంత సత్తా ఉన్న ప్రభాస్, ‘రాజా సాబ్’ చిత్రానికి మొదటి రోజు కనీసం 10 కోట్ల ఓపెనింగ్ ని కూడా పెట్టలేకపోయాడు. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ సినిమాకు కేవలం 6 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అన్ని వైపుల నుండి నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల ఈ సినిమాకు అలాంటి పరిస్థితి ఏర్పడింది. శనివారం రోజున, అనగా నిన్న ఈ చిత్రానికి కేవలం 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. సాధారణం గా నార్త్ ఇండియా లో శనివారం రోజున వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ ఉంటాయి. అలాంటిది రెండవ రోజు తగ్గిందంటే కచ్చితంగా మంచి ట్రెండ్ కాదని అర్థం. మొదటి రోజు 30 కోట్ల నెట్ కొట్టేంత సత్తా ఉన్న ప్రభాస్, ఇప్పుడు క్లోజింగ్ లో 20 కోట్లు కూడా కొట్టే స్థితి లో లేదు.
ఇదంతా కేవలం మారుతీ నిర్లక్ష్యం వల్లే. అతను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉండుంటే ఈరోజు ప్రభాస్ కి ఇలాంటి ప్రభావాన్ని ఎదురుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. మొదటి రోజు వరకు ఎంత ఫ్లాప్ టాక్ వచ్చిన తన సూపర్ స్టార్ స్టేటస్ తో ఈ సినిమాకు 90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు. కానీ రెండవ రోజు వసూళ్లు నైజాం ప్రాంతం లో తప్ప, దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ గా పడిపోయాయి. ఇక మూడవ రోజు అయితే వర్ణనీతం. ఆదివారం రోజున రెండవ రోజు తో పోలిస్తే 70 శాతం కి పైగా డ్రాప్స్. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు ఇంత డ్రాప్స్ రావడం ఎప్పుడూ జరగలేదు. ఫుల్ రన్ లో ఇలా అయితే 200 కోట్ల గ్రాస్ రావడం చాలా కష్టం అయిపోతుంది.