Mohanlal And Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమా మీద చిరంజీవి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. కాబట్టి దానికోసం స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నాడు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో చిరంజీవితో పాటు మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు. మోహన్ లాల్ ఇంతకుముందు చాలా మంది హీరోల సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్ లాల్ కీలకమైన పాత్రలో కనిపించాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు మరోసారి చిరంజీవి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అతని క్యారెక్టర్ ఏంటి అతని ఎంత సేపు కనిపిస్తాడు అనే విషయాలను డైరెక్టర్ బాబీ తొందర్లోనే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు.
మొత్తానికైతే మోహన్ లాల్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను కూడా తొందరగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం ఒక మాస్ గెటప్ ని బాబీ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి బాబీ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. కాబట్టి అదే సక్సెస్ ని మరోసారి రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో బాబీ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బాబీ అనుకున్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించి మరోసారి చిరంజీవికి సూపర్ సక్సెస్ ని కట్టబెడతాడా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు బాబీ చేసిన సినిమాలు ఒకెతైతే ఇప్పుడు ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమాతో చిరంజీవి ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. బాబీ సైతం స్టార్ డైరెక్టర్ గా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…