Mana Shankara Varaprasad Garu: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, ప్రాంతీయ బాషా చిత్రాల క్యాటగిరీలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుంది. ఈ చిత్రం తో పాటు విడుదలైన మిగిలిన చిత్రాల థియేట్రికల్ రన్స్ మొత్తం పూర్తి అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుందంటే మెగాస్టార్ చిరంజీవి కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి ఎన్నో అంశాలు తోడు అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) ఇంటర్వెల్ సమయం లో ‘పెద్ది రెడ్డి’ పాటకు వేసిన స్టెప్పులను ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు.
ఈ పాట థియేట్రికల్ వెర్షన్ కి భీమ్స్ గాత్రం అందించాడు. కానీ నేడు మేకర్స్ ఈ పాటకు మెగాస్టార్ గాత్రం అందించిన వెర్షన్ ని విడుదల చేశారు. పాట మధ్యలో నుండి మొత్తం మెగాస్టార్ చిరంజీవి నే పాడాడు. గతం లో కూడా చిరంజీవి కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు, కానీ ఇంత గొప్ప గా మాత్రం కాదు. ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగానే పాడాడు. ఈ వెర్షన్ పాటనే సినిమాలో కూడా ఉపయోగించి ఉండొచ్చు కదా?, ఎందుకు ఉపయోగించలేదు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. మేకర్స్ కూడా ఈ విషయాన్నీ ఇప్పటి వరకు చెప్పలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో వెంకటేష్ పాడిన పాటకు మంచి పబ్లిసిటీ చేశారు. కానీ ఈ పాటకు మాత్రం ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. ఇప్పుడు కూడా ఈ యూట్యూబ్ వివరాల్లోకి వెళ్లి చూస్తే కానీ సింగర్ మెగాస్టార్ చిరంజీవి అనే విషయం తెలియలేదు.
ఒకవేళ ఈ పాటని విడుదలకు ముందే పబ్లిసిటీ బాగా చేసి, లిరికల్ వీడియో సాంగ్ లాగా వదిలి ఉంటే హైప్ వేరే లెవెల్ కి చేరి ఉండేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ పాటని మీరు కూడా చూసేయండి. మెగాస్టార్ మ్యాజికల్ వాయిస్ పై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇకపోతే ఈ చిత్రం 17 రోజుల్లో 284 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నేడు కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు వెయ్యి కి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. పాన్ ఇండియన్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ థియేట్రికల్ రన్ చూడలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.