Mana Shankara Varaprasad Garu Collection: మెగాస్టార్(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం రోజురోజుకి బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని చూస్తుంటే, నేటి తరం స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు ఇప్పట్లో రావడం కష్టమేనేమో అని అనిపిస్తోంది. విడుదల రోజు నుండి, ఇప్పటి వరకు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రల్లో డబుల్ డిజిట్ షేర్ వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక నిన్న అనగా, 5 వ రోజున ఈ సినిమా ఆల్ టైం రికార్డుని నమోదు చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం 5వ రోజు ఈ చిత్రానికి 14 కోట్ల 56 లక్షల రూపాయుఇలా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీ లో 5వ రోజున ఏ చిత్రానికి కూడా ఈ రేంజ్ షేర్ వసూళ్లు నమోదు అవ్వలేదు.
ఈ చిత్రం తర్వాత #RRR మూవీ 13.63 కోట్ల రూపాయిలతో రెండవ స్థానం లో కొనసాగుతుండగా, 12.75 కోట్ల రూపాయిల షేర్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం మూడవ స్థానం లో. 11.43 కోట్ల రూపాయిలతో అలా వైకుంఠపురంలో చిత్రం నాల్గవ స్థానంలో, 11.35 కోట్ల రూపాయిలతో బాహుబలి 2 చిత్రం 5వ స్థానంలో కొనసాగుతుంది. టాప్ 5 లో 3 సంక్రాంతి సినిమాలే అవ్వడం విశేషం. అంటే కాకుండా నిన్నటితో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 110 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఆంధ్ర ప్రాంతం లో నిన్న నమోదైన వసూళ్లు నాల్గవ రోజు కంటే ఎక్కువ ఉండగా, తెలంగాణ లో మాత్రం కాస్త తగ్గింది. ఆదివారం నాటికి ఈ చిత్రం 220 కోట్ల మార్కుని అధికారికంగా దాటే అవకాశాలు ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం 5 రోజుల్లో 220 కోట్లు ఇచ్చినట్టు ప్రచారం చేశారు. అది కేవలం పబ్లిసిటీ మెటీరియల్ మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు.
ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతూ వస్తే మాత్రం ఈ చిత్రం ఫుల్ రన్ లో 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఓజీ, దేవర సినిమాల ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటినా ఆస్కార్యపోనక్కర్లేదని అంటున్నారు. 11 రోజులు దాటినా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి, ఈ సినిమాకు పండగ సెలవుల్లో అత్యధిక రేట్స్ పెట్టి చూడలేకపోయిన కొంత మంది జనాలు మూడవ వారం లో కూడా ఈ సినిమాని చూడొచ్చు. కేవలం 5 రోజుల్లోనే ఇంతటి భీభతం సృష్టిస్తుంటే, ఇక ఫుల్ రన్ అయ్యాక లెక్క ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.