Vijay Deverakonda: సినీ ఇండస్ట్రీ సోషల్ మీడియా లో వచ్చే రివ్యూస్ ద్వారా చాలానే నష్టపోతోంది. బాగున్న సినిమాలకు రివ్యూస్ ప్రభావం ఏమి ఉండదు, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే వసూళ్లను రాబడుతాయి అనేది రివ్యూయర్స్ చెప్పే మాట. కానీ నెగిటివ్ రివ్యూస్ వల్ల కచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పెద్ద సూపర్ స్టార్స్ తమ స్టార్ పవర్ తో నెగిటివ్ రివ్యూస్ కి ఎదురుగా నిలబడి భారీ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదే నెగిటివ్ రివ్యూస్ వల్ల యావరేజ్ గా ఉన్న సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలం లో బుక్ మై షో యాప్ లో రివ్యూస్ ఇచ్చే ఛాయస్ ని పెట్టారు. అది కూడా ఆ యాప్ లో టికెట్ ని కొనుగోలు చేసి వెళ్లిన వాళ్లకు మాత్రమే ఆ ఛాన్స్.
ఇది మంచి ఫీచరే..కానీ కొంతమంది పనిగట్టుకొని మరీ 10 వేలకు పైగా టికెట్స్ కొనుగోలు చేసి సినిమా చూడకుండానే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల బుక్ మై షో యాప్ లో టికెట్స్ కొనుగోలు చేసేవాళ్ళు రేటింగ్స్ ని చూసి, ఫ్లాప్ సినిమాకు టికెట్స్ బుక్ చేసుకోవడం ఎందుకు అని సైలెంట్ అయిపోతున్నారు. ఇది ఈమధ్య కాలం లో సినీ ఇండస్ట్రీ బాగా గమనించింది. ముందుగా కర్ణాటక లో కోర్టు నుండి అనుమతి తీసుకొని డెవిల్, మాక్స్ వంటి చిత్రాలకు బుక్ మై షో యాప్ లో రివ్యూస్ ఇచ్చే ఛాయస్ ని తీసేసారు. ఇప్పుడు మన తెలుగు లో ఈ నెల 12 న విడుదల కాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీ లో మొట్టమొదటిసారి ఇలా జరగడం. దీనిపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాసేపటి క్రితమే వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘ ఇది చూసిన తర్వాత నాకు సంతోషం కలిగింది, అదే సమయం లో బాధగా కూడా కలిగింది. ఎంతో మంది కష్టం, కలలు మరియు డబ్బు ని ఇలా రక్షించబడుతున్నందుకు సంతోషం వేస్తుంది. కానీ మన సొంత ప్రజలే ఇలాంటి సమస్యలను సృష్టిస్తున్నర్ఫాని తెలిసి చాలా బాధ వేస్తుంది. నువ్వు ఆనందంగా జీవించు, ఇతరులను ఆనందంగా జీవించనివ్వు, కలిసి ఎదుగుదాం అని చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటున్న జీవిత పాఠాల సంగతేంటి?, డియర్ కామ్రేడ్ చిత్రం నుండి నేను రివ్యూస్ విషయం లో కొంతమంది కుట్రదారులు చేస్తున్న రాజకీయాలను చూస్తూనే ఉన్నాను. మొదటిసారి నేనే స్పందించాను. ఇన్నాళ్లు నా మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మంచి సినిమాని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. కానీ దర్శక నిర్మాతలు రివ్యూస్ తాలూకా ప్రభావాన్ని స్వయంగా నా సినిమాలతోనే చూసి వాస్తవాన్ని గ్రహించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప సూపర్ స్టార్ ని కూడా ఇలాంటి సమస్యలు వెంటాడుతున్నాయి’ అంటూ విజయ్ దేవరకొండ వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.