Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసిన హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). సినీ ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు, మా అన్నయ్య సినీ హీరో గా చెయ్యాల్సినవన్నీ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు, ఆయన తమ్ముడిగా వస్తున్న నేను కొత్తగా ఎదో చేయాలి, ఆయన చేసినవి రిపీట్ చేయకుండా అనే ఉద్దేశ్యంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రం లో ఏకంగా 30 కార్లు నాన్ స్టాప్ గా తన చేతుల మీద పోయేలా చేసాడు. గుండెల మీద బండరాళ్లను పెట్టుకొని బద్దలు కొట్టుకునేలా చేసాడు. ఇలా ఒక్కటా రెండా , ఎన్నో రకాల మార్షల్ ఆర్ట్స్ ని ఆయన సందర్భం దొరికినప్పుడల్లా చూపిస్తూ వచ్చాడు.
అంతే కాదు కేవలం మార్షల్ ఆర్ట్స్ మీద ఆయన ‘జానీ’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కూడా. ఇందులో ఆయన చూపించినన్నీ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ హీరో కూడా చూపించలేదు. అయితే దురదృష్టం కొద్దీ ఈ చిత్రం ఆరోజుల్లో ఫ్లాప్ అయ్యింది. అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా అప్డేట్ గా ఉండడం వల్ల అర్థం చేసుకోలేకపోయారు. ఇక రీసెంట్ గా విడుదలైన పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఓజీ’ లో ఓజాస్ గంభీర గా, మార్షల్ ఆర్ట్స్ గురువు గా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తాడు. రెండవ భాగం మొత్తం అత్యధిక శాతం మార్షల్ ఆర్ట్స్ మీదనే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిభ ని మార్షల్ ఆర్ట్స్ లో గుర్తించిన జపాన్ దేశానికీ చెందిన ‘గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్’ సంస్థ ‘ది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే బిరుదు ని బహుకరించింది.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది అంటూ చిన్న గ్లింప్స్ వీడియో ని వదిలారు. ఇది అభిమానులకు అసలు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ పరంగా కొత్త స్కూల్ పెట్టబోతున్నాడా?, లేదా ఓజీ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ఏదైనా చెప్పబోతున్నాడా ?, అసలు ఏమిటిది అంటూ జుట్టుకు పీక్కున్నారు ఫ్యాన్స్. అసలు విషయం ఈరోజు వీడియో ద్వారా బయటకు వచ్చింది. ఆరు నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియో అభిమానులకు పూనకాలు రప్పించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్ ని భారత దేశానికీ చెందిన మొట్టమొదటి సమురాయ్ గా కూడా ప్రకటించింది.
Come, witness the most memorable part of Shri Pawan Kalyan’s Martial Arts Journey.#PKMartialArtsJourney pic.twitter.com/Z3D27hD2Uh
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 11, 2026