Mana Shankara Vara Prasad Garu: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘రాజాసాబ్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుడి మెప్పించలేదని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా మీద తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం…ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శకుడు మారుతి చాలా పెద్ద పెద్ద కామెంట్లు చేశారంటూ అయన అలా మాటలు మాట్లాడకపోయినా మాకు పెద్దగా అంచనాలు ఉండేవి కావు. కానీ అతను అలాంటి అంచనాలను రేకెత్తించి చివరికి ఒక నాసిరకపు సినిమాను మా ముందు ఉంచాడు అంటూ ప్రభాస్ అభిమానులైతే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇక మారుతి ఇంటిని సైతం చుట్టూ ముట్టడానికి ప్రభాస్ అభిమానులు ప్రయత్నించారు. ఏది ఏమైనా కూడా ప్రభాస్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ సినిమాగా మారబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఈ సినిమా సంక్రాంతి సినిమాల్లో మొదటి సినిమాగా వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈనెల 12వ తేదీన రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించే అవకాశాలైతే ఉన్నాయి. అనిల్ రావిపూడి సైతం ఈ సినిమాని కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. కాబట్టి ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుందంటూ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
గత సంవత్సర సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చిన ఆయన సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ ఇయర్ చిరంజీవికి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది… రాజాసాబ్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. కాబట్టి తనకు పోటీగా ఏ సినిమా లేదంటూ సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నాడట.
ఈ దెబ్బతో మన శంకర్ వరప్రసాద్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా పాజిటివ్ టాక్ సంపాదించుకుంటే మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది అనే అంచనాలో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది అనేది…