Vivek Oberoi: రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘దురంధర్’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ ఇండియన్ సినిమా యావత్ ప్రేక్షకులందరిని ఉర్రూతలుగించింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రానటువంటి ఒక గొప్ప కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడం నిజంగా చాలా గొప్ప విషయం…ఇక ఈ సినిమా మీద బాలీవుడ్ నటుడు ఆయన వివేక్ ఒబెరాయ్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని రెహమాన్ డికాయిట్ పాత్రలో అక్షయ్ కన్నా పోషించిన వినలిజం నెక్స్ట్ లెవెల్లో ఉందని ప్రశంసించాడు. ముఖ్యంగా అక్షయ్ కన్నా చేసిన క్రూరమైన పాత్రను చూస్తే ఒరిజినల్ గా రెహమాన్ ఎలా ఉండేవాడో మనం అర్థం చేసుకోవచ్చని అంత బాగా నటించాడు. ప్రస్తుతం ప్రేక్షకులు ప్రశంసలు అందుకుంటున్నాడు అంటూ వివేక్ అతన్ని పొగిడే ప్రయత్నం చేశాడు…ఇక మనలాంటివారు స్వతంత్రంగా బ్రతకడానికి మనం ముందు తరం వారు వాళ్ళ రేపటిని సైతం త్యాగం చేశారు.
ఒక అమరవీరుడు ఇంట్లోకి వెళితే జ్ఞాపకాలు మనల్ని ఎలా వెంటాడుతాయో ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ అమరవీరుల త్యాగాలు మనకు గుర్తొస్తూనే ఉంటాయి అంటూ వివేక్ ఒబెరాయి సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూనే ఒరిజినల్ గా ఎవరైతే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్లందరికి ప్రశంశలను అందిస్తున్నాను అంటూ వాళ్ళందరిని గుర్తు చేసుకున్నాడు.
ఇక 2023 వ సంవత్సరంలో వచ్చిన ‘అనిమల్’ సినిమా ఎలాగైతే బాలీవుడ్ బాక్సాఫీస్ ను చీల్చి చండాడిందో దురంధర్ సినిమా సైతం ఆ రేంజ్ లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుందంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి… నిజానికి అనిమల్ సినిమా గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడడం లేదు.
కారణం ఏంటి అంటే సందీప్ రెడ్డివంగా బాలీవుడ్ మాఫియాతో పెట్టుకున్న వైరం వల్ల ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడిన వాళ్లకు బాలీవుడ్ మాఫియా నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవచ్చనే ఉద్దేశంతో ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. కానీ ఎట్టకేలకు వివేక్ ఒబెరాయ్ లాంటి నటుడు ఆ సినిమా మీద పలు సందర్భాల్లో స్పందించాడు. సందీప్ రెడ్డి వంగ ఘట్స్ ఉన్న దర్శకుడు అంటూ అతని గురించి గతంలో చాలాసార్లు మాట్లాడాడు…