Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Vara Prasad Garu: ఇప్పటివరకూ అంతా చప్పగానే.. ‘చిరు, వెంకీ’ అయినా ‘శంకరవరప్రసాద్’ను...

Mana Shankara Vara Prasad Garu: ఇప్పటివరకూ అంతా చప్పగానే.. ‘చిరు, వెంకీ’ అయినా ‘శంకరవరప్రసాద్’ను లేపుతారా?

Mana Shankara Vara Prasad Garu: సంక్రాంతి వచ్చేస్తుంది..ఎప్పటి లాగానే ఈసారి కూడా అరడజను సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వాటిల్లో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రాల్లో ఒకటి ‘మన శంకర వరపరసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. భోళా శంకర్ తర్వాత దాదాపుగా […]

Mana Shankara Vara Prasad Garu: సంక్రాంతి వచ్చేస్తుంది..ఎప్పటి లాగానే ఈసారి కూడా అరడజను సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వాటిల్లో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రాల్లో ఒకటి ‘మన శంకర వరపరసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu). మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. భోళా శంకర్ తర్వాత దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది . అంతే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి నుండి రాబోతున్న సినిమా ఇది. వీటి అన్నిటికీ మించి ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించడం ఈ సినిమా పై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ఒకే తరానికి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి వెండితెర పై సందడి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చిరంజీవి , వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఒక సాంగ్ ఉంటుంది. ‘మీసాల పిల్ల’ సాంగ్ కే ఆడియన్స్ మెంటలెక్కిపోయారు, ఈ పాట విడుదలైన తర్వాత ఏమైపోతారో అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడు ఈ పాట ని విడుదల చేస్తారు, జనవరి నెల వచ్చేస్తోంది, ప్రొమోషన్స్ చేయడం లేదు, విడుదల చేస్తామని చెప్పినవి కూడా ఆపుతున్నారు, అసలు ఈ సినిమా విడుదల ఉందా లేదా అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేశారు. వాళ్లకు సమాధానంగా కాసేపటి క్రితమే ఈ కాంబినేషన్ లోకి పాటకు సంబంధించిన ఫోటో ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి, వెంకటేష్ లుక్స్ అదిరిపోయాయి అని, సాంగ్ కూడా కుమ్మేసి ఉంటారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ పాటకు సంబంధించిన ప్రోమో సాంగ్ ని డిసెంబర్ 30 న విడుదల చేస్తారట. మరి పూర్తి పాటని ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. బహుశా జనవరి 1న విడుదల చేస్తారేమో అని అభిమానులు అంటున్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని, డిసెంబర్ 30 న ప్రోమో ని విడుదల చేసే బదులు, పాటని విడుదల చేయొచ్చు కదా అంటూ అభిమానులు మూవీ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా అనిల్ రావిపూడి మార్క్ ప్రొమోషన్స్ ఈసారి బాగా మిస్ అయ్యింది అనే చెప్పాలి. ఇక పాటల విషయానికి వస్తే మీసాల పిల్ల సాంగ్ క్లిక్ అయినప్పటికీ, ఆ తర్వాత విడుదలైన శశిరేఖ పాట మాత్రం మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లో ప్రతీ పాట పేలింది. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయం లో అలా జరగడం లేదు. కనీసం ఈ కాంబినేషన్ సాంగ్ అయినా హిట్ అవుతుందో లేదో చూద్దాం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper