Mana Shankara Vara Prasad Garu 9 Days Collections: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రం తో పాటు వచ్చిన మిగిలిన నాలుగు సినిమాల వసూళ్లు బాగా డౌన్ అయ్యాయి. కానీ మెగాస్టార్ మాత్రం వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ ఫుల్స్ ని నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇప్పుడే ఇలా ఉందంటే, ఈ వీకెండ్ ఈ చిత్రం ఏ రేంజ్ పవర్ ప్లే బ్యాటింగ్ చేస్తుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. శనివారం, ఆదివారం, సోమవారం(రిపబ్లిక్ డే), ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ వర్గాలు. ఇకపోతే 9 వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇక 9 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రం రాబట్టిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నైజాం ప్రాంతం లో ఈ చిత్రం నిన్న వచ్చిన వసూళ్లతో కలిపి 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఇక ఆ తర్వాత సీడెడ్ ప్రాంతం నుండి 19 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అంటున్నారు. ఈరోజు వచ్చే వసూళ్లతో కచ్చితంగా ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుంది. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో 9 రోజులకు 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో ఈ ప్రాంతం లో కూడా ఈ చిత్రం 20 కోట్ల షేర్ మార్కుని అందుకోనుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే తూర్పు గోదావరి నుండి 13 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, పశ్చిమ గోదావరి నుండి 8 కోట్ల 60 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 10 కోట్లు, కృష్ణా జిల్లా నుండి 9 కోట్ల 70 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 5 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 124.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 185 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 9 రోజుల్లో 11 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఓవర్సీస్ నుండి 18 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 154 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 247 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.