https://oktelugu.com/

Samyuktha Menon: ‘మహేష్’ మరదలిగా ‘రానా’ హీరయిన్ ఖరారు

Samyuktha Menon: మలయాళీ నటి సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్‌’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందులో ఆమె రానా సరసన నటించింది. కాగా.. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఆమె మరో భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌ గా సంయుక్త ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మహేష్ మరదలిగా ఈ మలయాళ బ్యూటీ ఎంపిక అయిందట. మరోవైపు ధనుష్‌ తో కూడా సంయుక్త […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 12:46 PM IST
    Follow us on

    Samyuktha Menon: మలయాళీ నటి సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్‌’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందులో ఆమె రానా సరసన నటించింది. కాగా.. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఆమె మరో భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్‌ గా సంయుక్త ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మహేష్ మరదలిగా ఈ మలయాళ బ్యూటీ ఎంపిక అయిందట.

    Samyuktha Menon

    మరోవైపు ధనుష్‌ తో కూడా సంయుక్త మీనన్ ఓ సినిమా చేస్తూ బిజీగా ఉందామె. అయితే, మహేశ్ సరసన ఈ భీమ్లా నాయక్ బ్యూటీ నటిస్తే.. ఆ క్రేజే వేరు. కాగా ఈ పాన్ ఇండియా సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ మలయాళీ నటి సంయుక్త మీనన్ ను కూడా రంగంలోకి దించుతున్నాడు.

    Also Read:  కరువు రాయలసీమకు సముద్రం తీసుకొచ్చిన జగన్

    సహజంగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు నటీనటులను ఎంపిక చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను పెడతాడు. ఈ క్రమంలోనే మెయిన్ హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేను ఫైనల్ చేశాడు. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ పాత్రలో మలయాళీ నటి ఖరారు చేశాడు.

    Samyuktha Menon

    ఇక ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారని గతంలో అనేక వార్తలు వచ్చాయి. కాగా హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి మొదలుకానుంది.

    Also Read:  వెంకటేశ్‌ వదులుకుంటేనే బాలయ్యకి అదృష్టం పట్టింది

    Tags