CM KCR Farm House: రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ దిట్ట. భవిష్యత్ లో ఓ పనిని అనుకుని దాని చుట్టూ రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. అది అర్థం కాక ప్రతిపక్షాలు కూడా ఆయన ట్రాప్ లో పడిపోయన ఘటనలు అనేకం చూశాం. తెర వెనక మరో ప్లాన్ ను ఉంచుకుని తెర ముందు మాత్రం ఒక ప్లాన్‌ను అందరికీ తెలిసేలా చేస్తుంటారు. అందరూ అదే అసలు ప్లాన్ అనుకుని బురిడీ కొడుతారు. ఇప్పుడు కేసీఆర్ ఇలాగే ఓ పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.
అసలు కేసీఆర్‌ను కలవాలంటే మంత్రులకు కూడా సరిగ్గా అపాయింట్ మెంట్ దొరకదు. ఆయన ప్రగతి భవన్ కంటే ఎక్కువ ఫామ్ హౌస్ లోనే ఉంటారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు పార్టీలో లేని వ్యక్తికి అది కూడా అసలు ఏ పార్టీలో లేని, తెలంగాణతో సంబంధం లేని ప్రకాశ్ రాజ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్. ప్రకాశ్ రాజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తూ, దగ్గరుండి ఆయన్ను రిసీవ్ చేసుకుంటున్నారు.
మొన్న ముంబై వెళ్లినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపడం ఖాయం అని తెలిసిపోయింది. కాగా యాంటీ బీజేపీ జెండా ఎత్తుకోవడం వల్ల ప్రకాశ్ రాజ్‌ను కేసీఆర్ దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఫామ్ హౌజ్ లోకి ప్రకాశ్ రాజ్, ప్రశాంత్ కిషోర్ వెళ్లారు. వీరిద్దరూ కేసీఆర్ తో దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపారు.
ముఖ్యంగా ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఎలా స్పందించాలి. ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనే దానిపైనే ఈ ముగ్గురు చర్చించుకున్నారు. ఇక దేశ రాజకీయాల్లో కేసీఆర్ కు ఇతర పార్టీల నేతలకు సమన్వయ కర్తగా ప్రకాశ్ రాజ్ పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ కలిసి ప్రకాశ్ రాజ్‌కు పలు సూచనలు కూడా చేశారని సమాచారం.
Also Read: కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎంట్రీ కావాలంటే?
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాయాన్ని కోరుతున్నారు కేసీఆర్. అదే సమయంలో దేశ రాజకీయాల్లో కూడా తన ప్రభావాన్ని చూపించే విదంగా ప్రకాశ్ రాజ్‌ను రంగంలోకి దింపారు. అయితే కేసీఆర్ కు ఓ అసలైన టీమ్ ఉంది. ఇందులో మాజీ ఎంపీ వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేకే, సంతోష్ కుమార్, కవిత, కేటీఆర్, హరీశ్ రావు ఉంటారు. ఏ ఎన్నికలైనా ఎలాంటి కార్యక్రమాలైనా వీరు దగ్గరుండి చూసుకుంటారు.
మరి వారందరినీ కాదని కేసీఆర్ ఎందుకు ప్రకాశ్ రాజ్‌కు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారన్నదే పెద్ద ప్రశ్న. అయితే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఏకకాలంలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఇటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, ప్రకాశ్ రాజ్ బాధ్యతలతో కేసీఆర్ తాను అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. కాగా ప్రశాంత్ కిషో ర్ తో కేసీఆర్ సమావేశమైనట్టు ఇదే మొదటిసారి బయటకు వచ్చింది.
Also Read: బయ్యారం కోసం తెలంగాణ సర్కార్ ఉద్యమం