https://oktelugu.com/

Nandamuri Balakrishna: వెంకటేశ్‌ వదులుకుంటేనే బాలయ్యకి అదృష్టం పట్టింది

Nandamuri Balakrishna: ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్ మీద ‘అన్‌ స్టాపబుల్‌’ అంటూ హోస్ట్‌ గా బాలయ్య అదరగొట్టాడు. పైగా నేషనల్ రేంజ్ లో అందరినీ ఫిదా చేస్తున్నాడు. అయితే ఈ షోకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ కార్యక్రమానికి మొదట బాలకృష్ణను హోస్ట్‌ గా అనుకోలేదని, మరో సీనియర్ హీరో వెంకటేశ్‌ ను హోస్ట్ గా అనుకున్నారని తెలుస్తోంది. పైగా వెంకటేశ్‌ హోస్ట్ గా చేయమని సంప్రదిస్తే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 27, 2022 / 12:27 PM IST
    Follow us on

    Nandamuri Balakrishna: ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్ మీద ‘అన్‌ స్టాపబుల్‌’ అంటూ హోస్ట్‌ గా బాలయ్య అదరగొట్టాడు. పైగా నేషనల్ రేంజ్ లో అందరినీ ఫిదా చేస్తున్నాడు. అయితే ఈ షోకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఈ కార్యక్రమానికి మొదట బాలకృష్ణను హోస్ట్‌ గా అనుకోలేదని, మరో సీనియర్ హీరో వెంకటేశ్‌ ను హోస్ట్ గా అనుకున్నారని తెలుస్తోంది.

    Balakrishna

    పైగా వెంకటేశ్‌ హోస్ట్ గా చేయమని సంప్రదిస్తే ఆయన ఒప్పుకోలేదట. ఆ తర్వాత ఎవరు అయితే బాగుంటుంది ? అని అరవింద్ ఆలోచిస్తూ ఉండగా.. బాలయ్య గుర్తుకు వచ్చారట. కానీ, బాలయ్య అసలు హోస్ట్ గా ఒప్పుకుంటారా ? సరే, ఓ మాట అడుగుదాం అని బాలయ్యను అడగ్గా.. వెంటనే ఆలోచించకుండా బాలయ్య ఓకే చెప్పేశాడని అల్లు అరవిందే షాక్ అవుతూ చెప్పిన సంగతి తెలిసిందే.

    Also Read: భర్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆనందంగా భార్య మాటలు.. విచారణలో విస్తుపోయే నిజాలు..

    బాలయ్య హోస్ట్‌గా ఈ షో దూసుకెళ్తుండటంతో నిర్వాహకులు కూడా ఫుల్ కుష్ అవుతున్నారు. ఇక ఇక ఈ ‘అన్ స్టాపబుల్’ షో చివరి ఎపిసోడ్ కి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రోమోలో బాలయ్య కామెంట్స్, మహేష్ ఆన్సర్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి.

    venkatesh

    ఇక ఇప్పటికే 9 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మొత్తానికి గ్రాండ్‌ ఫినాలేకి రెడీ అయింది. ఈ చివరి ఎపిసోడ్ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా బాలయ్య తన రేంజ్ ఏమిటో మరోసారి ఘనంగా చాటుకున్నారు. అయితే, వెంకటేశ్‌ వదులుకుంటేనే బాలయ్యకి అదృష్టం పట్టింది అన్నమాట.

    Also Read: ఎన్టీఆర్ జిల్లాపై టీడీపీ, నందమూరి ఫ్యామిలీ గప్ చుప్.. ఎందుకు స్పందించట్లేదు?

    Tags