Tollywood Heroine : అయితే వీళ్ళు తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా ఎవరూ ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. మరి కొంతమంది తొలి సినిమాతో తమకు వచ్చిన క్రేజ్ కంటిన్యూ చేయడంలో విఫలం అవుతారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నువ్వు నేను సినిమా హీరోయిన్ కూడా తొలి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. హీరో ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉదయ్ కిరణ్ తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ కెరియర్ ప్రారంభంలో హ్యాట్రిక్ హీట్ అందుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో వరుసగా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరోగా అప్పట్లో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ ఉన్న కథలతో సినిమాలు చేసి యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ సినిమాలకు బాగా క్రేజ్ ఉంది. అప్పట్లో ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు అన్నిటిలోని పాటలు, డైలాగులు అన్నీ కూడా ఎప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. అంతలా ఆ పాటలు డైలాగులు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయని చెప్పొచ్చు.
Also Read : లిక్కర్ స్కాం లో డ్రాగన్ సినిమా నటి.. అధికారుల విచారణలో విస్తు పోయే వాస్తవాలు
ఉదయ్ కిరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాలలో నువ్వు నేను సినిమా కూడా ఒకటి. మంచి ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ఒక సంచలనం సృష్టించింది అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా నువ్వు నేను సినిమాలోని పాటలు అన్నీ యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ లో దూసుకుపోతున్నాయి. అయితే నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ అనిత ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది. అనిత నువ్వు నేను సినిమాలో తన అందంతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. నువ్వు నేను సినిమాతో అనిత తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ నువ్వు నేను సినిమాతో వచ్చిన క్రేజ్ మాత్రం ఆ తర్వాత అనిత కాపాడుకోవడంలో విఫలం అయింది. తెలుగులో అనిత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాలలో నటించిన కూడా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత హిందీలో అనిత వరస అవకాశాలను అందుకొని అక్కడ సీరియల్స్, సినిమాలలో నటిస్తూ బిజీ నటిగా మారిపోయింది. 44 ఏళ్ల వయసులో కూడా అనిత ఏమాత్రం తగ్గని అందంతో సామాజిక మాధ్యమాలలో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.
View this post on Instagram