Janasena: ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులు నిరంతర పోరాటం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి తో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా క్యాపిటల్ అని తెలిపింది. అంతేకాకుండా పరిపాలన రాజధానికి విశాఖ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం విలువైన తమ భూములను ధారధత్తం చేశామని, ఇప్పుడు ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తే తమ గతేం గాని అని అక్కడి రైతులు ఆందోళన చెందారు. దీంతో అప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు.
అయితే వీరి ఆందోళనకు టీడీపీ మాత్రమే మద్దతు ఇస్తూ వస్తోంది. కొన్నాళ్ల తరువాత బీజేపీ, జనసేనలు అలా వచ్చి రైతులను కలిసి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానీ టీడీపీ మాత్రం వారి వెన్నంటే ఉంటుందని కొందరు ఆ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. అయితే కేవలం నిరసనలతో కాకుండా పాదయాత్ర నిర్వహించాలని రైతులు భావించారు. దీంతో నవంబర్ 2న తూళ్లూరులో పాదయాత్రను ప్రారంభించారు. ఎప్పటిలాగే వీరి పాదయాత్రకు టీడీపీ మద్దతు ఇస్తూ ఆ పాదయాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు.
Also Read: అమరావతి రైతుల పాదయాత్రకు పవన్ వెళ్లడట..!
45 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రకు ఊరూరా మద్దతు లభిస్తోంది. కొందరు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దక్షిణ రాష్ట్రాల సదస్సలో పాల్గొనడానికి వచ్చిన సమయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రలో మద్దతు తెలపాలని, ఇందులో పాల్గొనాలను సూచించారు. దీంతో మరుసటి రోజు నుంచి బీజేపీ సీనియర్ నేతలతో సహా పాదయాత్రలో పాల్గొంటున్నారు.
ఈ తరుణంలో జనసేన(Janasena) సైతం అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ‘అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో జనసేన పార్టీ ఈనెల 26 నుంచి పాల్గొంటుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ప్రస్తుతం నెల్లూరులో ఈ పాదయాత్ర సాగుతోంది. ఈనెల 26న ఉదయం 10 గంటలకు నార్త్ రాజులపాలెం దగ్గర జనసేన బృందం అమరావతి రైతులతో కలుస్తుంది’ అని పేర్కొన్నారు.
Also Read: ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే! వరద బాధితుల వద్దకు పవన్