Ee Nagaraniki Emaindi 2: యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో పెద్దగా ఆడలేదు , యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం నేటి తరం యూత్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది ఈ చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సంపాదించుకుంది. అందుకే ఈ చిత్రాన్ని కొన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చేయగా, మొదటిసారి విడుదల చేసినప్పుడు ఎంత వసూళ్లు వచ్చాయో , అంతకు మించిన వసూళ్లు రావడం గమనార్హం. మేకర్స్ కి ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఇంత క్రేజ్ ఉందా అనే విషయం కూడా అప్పుడే అర్థమైంది. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు , ఆ బ్రాండ్ ని ఉపయోగించుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి?.
అందుకే తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్రకటించారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 19 న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్నీ బ్రాండ్ న్యూ ప్రోమో ద్వారా ప్రకటించారు మేకర్స్. స్నేహితులు చాలా కాలం తర్వాత రీ యూనియన్ అవ్వడం , ఒక కారులో ట్రిప్ కి బయలుదేరుతున్నట్టు ఈ ప్రోమో లో చూపించారు. ఈ చిత్రానికి ‘ENE రిపీట్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మొదటి భాగం లో కనిపించిన నటీనటులంతా ఇందులో కూడా కనిపించబోతున్నారు, ఒక్క సాయి సుశాంత్ తప్ప. ఆయనకు బదులుగా మాగంటి శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈరోజు విడుదల చేసిన ప్రోమో లో అతను కూడా కనిపించారు. రీసెంట్ గానే ఇతను పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు కూడా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు ని తెచ్చుకున్నారు.
అయితే మొదటి భాగాన్ని నిర్మించిన సురేష్ బాబు , రెండవ భాగం లో మాత్రం భాగం అవ్వడం లేదు. ఆయనకు బదులుగా సృజన యర్రబోలు , సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతలు చేపట్టారు. మొదటి భాగం కంటే ఫన్నీ గా, యూత్ ఆడియన్స్ చిరకాలం గుర్తించుకునేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మరి అప్పటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదని అనేది చూడాలి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్ సేన్ కి ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడం ఆయనకు కెరీర్ కి చాలా ముఖ్యం. చూడాలి మరి , ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది.
Rey manam kalisi taagi 8 years aithundi ra.
November 19th kaluddam.
Malli taagudham. Is that clear? #ENERepeat in cinemas from November 19th, 2026 #8YearsOfENE #ENE2#ENERepeatOnNov19th pic.twitter.com/9ySpDJqyvJ— ENE Repeat (@ENERepeat) June 29, 2026
