spot_img
Homeబిజినెస్Jio smart inverter price: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో...

Jio smart inverter price: మిడిల్ క్లాస్ పీపుల్స్ కు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో Jio ఇన్వర్టర్..

Jio smart inverter price: ప్రస్తుతం చాలా అవసరాలకు విద్యుత్ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా నివాస గృహాల్లో మొబైల్ ఛార్జింగ్ నుంచి కిచెన్ లో కూడా విద్యుత్ అవసరం పెరిగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో విద్యుత్ అంతరాయం ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇంట్లో రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం కలిగితే అవస్థలు పడాల్సి వస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొందరు ప్రత్యేకంగా ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకుంటారు. అయితే మధ్యతరగతి ప్రజల కోసం JIO కంపెనీ నుంచి Smart Inverter ను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా ఇన్వర్టర్ కొనుగోలు చేస్తే రూ.20,000 వరకు ఉండొచ్చు. కానీ ఇది తక్కువ ధరలో అందిస్తున్నారు. అయితే ఇటీవల దీనిని ఇన్వర్టర్ తో పాటు బ్యాటరీ కూడా అందిస్తున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే..

మధ్యతరగతి ప్రజల కోసం Reliance JIO కంపెనీ నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు పవర్ బ్యాకప్ కోసం కొత్తగా ఇన్వర్టర్ ను పరిచయం చేయబోతున్నారు. ఇది విద్యుత్ అంతరాయం ఉన్న సమయంలో ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ఇన్వర్టర్ లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు ఓవర్ లోడ్ ప్రొటెక్షన్ తో రాబోతుంది. ఇందులో లిథియం అయాన్/ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ సామర్థ్యం 150 Ah ఉంటాను అన్నట్టు అంచనాలు వేస్తున్నారు. అలాగే ఈ బ్యాటరీ ఉండే ఇన్వర్టర్ సామర్థ్యం 1kVA నుంచి 3kVA వరకు ఉండనుంది. ఇది కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే కాకుండా దుకాణాలు, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఉపయోగపడే అవకాశం ఉంది. విద్యుత్ అంతరాయ సమయంలో లైట్లు, ఫ్యాన్, రౌటర్లు నడపడానికి ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా ఇది 24 గంటల పాటు బ్యాక్అప్ ఇచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాల వారంటీ ఇచ్చే ఈ ఇన్వర్టర్ ను రూ.4,999 నుంచి రూ.9,000 వరకు విక్రయించే అవకాశం ఉంది. త్వరలో వేసవికాలం రాబోతున్నందున దీనిని మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది మార్కెట్లోకి వస్తే నివాస గృహాల్లో, చిన్న వ్యాపార సంస్థలు కచ్చితంగా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఉండడంతో విద్యుత్ హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. స్థిరమైన అవుట్ పుట్ తో నాణ్యమైన పవర్ను అందిస్తుంది. ఇందులో చేర్చబడిన బ్యాటరీ దీర్ఘకాలికంగా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు తగ్గించడంలోనూ ఇది సపోర్టుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version