Homeఆంధ్రప్రదేశ్‌TTD Laddu Ghee Controversy: టీటీడీ 'నెయ్యి' వివాదంలో నేషనల్ మీడియా.. ఆ పార్టీకి షాక్!

TTD Laddu Ghee Controversy: టీటీడీ ‘నెయ్యి’ వివాదంలో నేషనల్ మీడియా.. ఆ పార్టీకి షాక్!

TTD Laddu Ghee Controversy: ఏపీలో( Andhra Pradesh) టీటీడీ లడ్డూ వివాదం తీవ్ర దుమారానికి దారితీసింది. లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని వచ్చిన ఆరోపణల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలిపినట్లు స్పష్టమైన ఆధారాలు దొరకలేదని.. కానీ రసాయనాల మిశ్రమం కలిసిందని.. అసలు ఆవు పాలతో తయారు చేసిన నెయ్యి కాదని సిబిఐ తేల్చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు అందులో జంతు కొవ్వు కలవలేదని అంశాన్ని పట్టుకొని వితండవాదం చేస్తోంది. దీనిపై వక్ర భాష్యం చెబుతూ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు ఎపిసోడ్ నడిచింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నెయ్యిలో కల్తీ జరగడంపై అనేకమంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వైసిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నేతల తీరును ఖండించారు. ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్నాబ్ గోస్వామి సంచలన కామెంట్స్..
మరోవైపు నేషనల్ మీడియాలో( National media) సైతం పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి ఈ నెయ్యి కల్తీ వ్యవహారంపై. అయితే ఉన్నట్టుండి రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాబ్ గోస్వామి ఈ అంశాన్ని టేక్ అప్ చేశారు. సిబిఐ స్పష్టంగా కల్తీ జరిగిందని చెబితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వితండవాదం చేస్తోందని మండిపడ్డారు. తక్షణం ప్రజల మధ్యకు వచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పాలని సూచించారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా చేయగలరా అంటూ నిలదీశారు. తిరుమల లడ్డు కు 300 ఏళ్ల చరిత్ర ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారని.. అటువంటి లడ్డును అపవిత్రం చేసి ఈ అడ్డగోలు మాటలు ఏంటి అని ప్రశ్నించారు ఆర్నాబ్. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సైతం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

వైసీపీకి ఇబ్బందికరమే..
నేషనల్ మీడియాలో సైతం టీటీడీ లడ్డూ వివాదానికి సంబంధించి కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ తమకు క్లీన్ చీట్ ఇచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటుంది. అయితే సిబిఐ నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పింది. కానీ ఎంతవరకు జంతువు కలవలేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే సిబిఐ పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆర్నాబ్ గోస్వామి ( Arnab Goswami)గట్టిగానే ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్నాబ్ గోస్వామి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.