https://oktelugu.com/

Majaka : ‘మజాకా’ టార్గెట్ 11 కోట్లు..కానీ 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇంతే..పాపం సందీప్ కిషన్ టైం ఇంత చెత్తగా ఉందేంటి!

Majaka : సందీప్ కిషన్(Sundeep Kishan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'మజాకా'(Mazaka Movie) శివరాత్రి సందర్భంగా విడుదలై మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Written By: , Updated On : February 28, 2025 / 01:44 PM IST
Majaka

Majaka

Follow us on

Majaka : సందీప్ కిషన్(Sundeep Kishan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) శివరాత్రి సందర్భంగా విడుదలై మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఈ మూవీ టీం చేసిన ప్రొమోషన్స్ అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా వీళ్ళే కనిపించేవారు. ఈ రేంజ్ ప్రొమోషన్స్ చేస్తున్నారంటే కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. సందీప్ కిషన్ మీడియం రేంజ్ హీరో నుండి మరో లెవెల్ కి వెళ్ళడానికి చాలా గట్టి ప్రయత్నమే చేసాడు కానీ, ఆ ప్రయత్నం చివరికి విఫలమైంది. చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ చిత్రానికి మార్కెట్ లో మంచి బజ్ ఏర్పడింది ఈ సినిమాకే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 11 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

అనుకున్న విధంగా టాక్ వచ్చి ఉంటే కేవలం రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి ఉండేది. కానీ రాలేదు కాబట్టి ఇప్పుడు కనీసం 50 శాతం రికవరీ అయినా ఈ చిత్రం సాధిస్తుందా అంటే అనుమానమే.ఎందుకంటే రెండవ రోజు వచ్చిన వసూళ్లు అంత దారుణంగా ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిసున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి రెండవ రోజు కేవలం కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. అంటే షేర్ వసూళ్లు 55 నుండి 60 లక్షల రూపాయిల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద రెండు రోజులకు కలిపి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లాలంటే కచ్చితంగా 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యం అని చెప్పక తప్పదు.

Also Read : సందీప్ కిషన్ ‘మజాకా’ చిత్రం సూపర్ హిట్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రాబట్టాలో తెలుసా..? ఇలా అయితే కష్టమే!

ఎందుకంటే ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిన, కేవలం రేపు, ఎల్లుండి మాత్రమే రాబట్టాలి. ఈ రెండు రోజులు కనీసం 80 లక్షల నుండి కోటి రూపాయిల షేర్ వరకు రాబడితే ఈ చిత్రానికి 50 శాతం రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ వారం తో థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయినట్టే. ఫుల్ రన్ లో కనీసం 50 శాతం నష్టాలను మిగిలించి, కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సందీప్ కిషన్ గత చిత్రం ‘భైరవ కోన’ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇక కుర్రాడు లైన్ లో పడ్డాడు, వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటాడు అని అందరూ అనుకుంటే చివరికి మళ్ళీ పాత ట్రాక్ లోకి వెళ్ళిపోయాడు సందీప్ కిషన్. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా ఇతనికి అదృష్టం వరిస్తుందా లేదా అనేది.

Also Read : నాలుగేళ్లు ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన విషయం వాస్తవమే అంటూ నిజం ఒప్పుకున్న సందీప్ కిషన్!