Maithri Producers : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ టాప్ ప్రొడక్షన్ హౌజ్ గా ఎదిగిన సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ వారు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి కావడం విశేషం… పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సంస్థ ఇప్పుడు ఇతర భాషల్లో ఉన్న హీరోలతో సినిమాలను చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అజిత్ తో చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Agli) అనే సినిమాని చేశారు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి ఇతర భాషలో హీరోల మీదనే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ (Sharukh Khan) ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇంతకుముందు బాలీవుడ్ హీరో అయిన సన్నీ డియోల్ (Sunny Deol) తో జాట్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని సాధించారు.
ఆ సక్సెస్ ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు షారుక్ ఖాన్ తో మరోసారి సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానికోసమే సుకుమార్(Sukumar) – షారుక్ ఖాన్ (Sharukh Khan) కాంబినేషన్ ని కలిపే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు ఎందుకని ఇతర భాషల హీరోల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మన దగ్గర ఉన్న హీరోలను వాడుకోవచ్చు కదా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మనవాళ్లు మన హీరోలను సపోర్ట్ చేస్తే మన సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది. తద్వారా పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంటుంది. అలా కాకుండా వందలు కోట్ల బడ్జెట్లను ఇతర హీరోల మీద పెట్టడం మంచి కాన్సెప్ట్ తో వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మనకున్న క్రెడిబులిటి తగ్గిపోవడమే కాకుండా వాళ్ళ ఇమేజ్ ను పెంచిన వాళ్ళమవుతాము.
చాలా సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ని అనుభవిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మన వాళ్లు వాళ్లను డామినేట్ చేస్తూ ముందుకు సాగాలి. కానీ వాళ్ల చంకలో చేరి వాళ్ళని హైప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…