Sitara : మహేష్ కూతురు సితార క్రిస్మస్ సెలబ్రేషన్స్.. షేక్ చేస్తున్న వైరల్ ఫోటోలు…

యాంకర్ గా కూడా రాణిస్తుంది..ఇలా అన్ని విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న సితార ఎప్పుడు ఏదో ఒకటి చేసి అందర్నీ అలరిస్తూ ఉంటుంది.

Written By: NARESH, Updated On : December 19, 2023 9:08 pm
Follow us on

Sitara Christmas Celebrations : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించి పెట్టాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ నుంచి నటవరసత్వాన్ని పునుకి పుచ్చుకున్న మహేష్ బాబు ఎక్కడ కూడా తగ్గకుండా తనదైన రీతిలో వరుసగా సక్సెస్ లు కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు గా సోషల్ మీడియా లోకి ఎంటర్ అయిన సితార తన కంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఇప్పటికే సెలబ్రిటీలకు సైతం సాధ్యం కానీ విధంగా సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న సితార ప్రస్తుతం ఒక సెలబ్రిటీ హోదాని అనుభవిస్తుంది. ఇప్పటికే ఆమె యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తూ వస్తుంది. కొన్ని జ్యువెలరీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె క్రిస్మస్ పండగ దగ్గరికి వస్తున్న నేపథ్యం లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ పండగని సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఆ ఫోటోలను చూసిన సితార అభిమానులు చాలా క్యూట్ గా ఉన్నావ్ సీతార అంటూ చాలా రకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే సీతార మరి కొన్ని రోజుల్లో హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో తన సత్తా చాటపోతుంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సితార మహేష్ బాబు లాగానే చాలా క్యూట్ గా అందంగా ఉంటుంది. అలాగే ఆయన సినిమాలోని పాటలకి డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది. తను నటనపరంగా గానీ, డాన్స్ పరంగా గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటూ వస్తుంది. వీలైతే ఫ్యూచర్ లో నటిగా కూడా తను సత్తా చాటపోతున్నట్టుగా అర్థమవుతుంది.

ఇక మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమం లో సితార తనుకున్న ఒక యూ ట్యూబ్ చానెల్ లో మహేష్ బాబు ని ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వాళ్ల సినిమా ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటుంది. సితార మల్టీ టాలెంటెడ్ అటు యాక్టింగ్ చేస్తుంది.. డాన్స్ చేస్తుంది.. అలాగే యాంకర్ గా కూడా రాణిస్తుంది..ఇలా అన్ని విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న సితార ఎప్పుడు ఏదో ఒకటి చేసి అందర్నీ అలరిస్తూ ఉంటుంది.