https://oktelugu.com/

‘కియారా’ వైపు మహేష్, ‘పూజా’ వైపు త్రివిక్రమ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాకు ఈ కరోనా లాక్ డౌన్ ఖాళీ సమయం బాగా కలిసి వచ్చింది. దాంతో ఈ సినిమాకి సంబంధించి ఒక్కో ఏర్పాటు జరుగుతున్నాయి. ఆగస్టు తరువాత సెట్ మీదకు వెళ్లనుంది ఈ సినిమా. అందుకే ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను కూడా ఫినిష్ చేసాడు. మహేష్ కూడా పూర్తి స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సినిమా టెక్నీషియన్లను, నటీనటులను లాక్ చేస్తున్నారని […]

Written By: , Updated On : June 11, 2021 / 04:13 PM IST
Follow us on

Mahesh Trivikramసూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాకు ఈ కరోనా లాక్ డౌన్ ఖాళీ సమయం బాగా కలిసి వచ్చింది. దాంతో ఈ సినిమాకి సంబంధించి ఒక్కో ఏర్పాటు జరుగుతున్నాయి. ఆగస్టు తరువాత సెట్ మీదకు వెళ్లనుంది ఈ సినిమా. అందుకే ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను కూడా ఫినిష్ చేసాడు. మహేష్ కూడా పూర్తి స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం ఈ సినిమా టెక్నీషియన్లను, నటీనటులను లాక్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. అయితే, ఇప్పుడు హీరోయిన్ ఎవరు అన్నదే త్రివిక్రమ్ ముందు నిలిచిన అసలు పాయింట్. మహేష్ బాబుకు కియారా అద్వానీ ఆసక్తి ఉంది. పైగా ఆమెతో కలిసి నటిస్తే బాలీవుడ్ రేంజ్ లో సినిమాకి క్రేజ్ వస్తోంది. కానీ త్రివిక్రమ్ కి పూజా మీద అసలు గురి వుంది.

కానీ మహేష్ మాటను కాదనలేడు. కాబట్టి కియారాని హీరోయిన్ పెట్టుకుంటే, రేపు డేట్ లు సమస్య అవుతాయేమో అని భయపడుతున్నట్లు మహేష్ తో త్రివిక్రమ్ చెప్పుకొస్తున్నాడు. నిజానికి త్రివిక్రమ్ సినిమా కాస్టింగ్ విషయంలో ఏ స్టార్ హీరో ఎక్కువ ఇన్ వాల్వ్ అవ్వడు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అంటేనే స్టార్ కాస్ట్, కాంబినేషన్ సీన్లు ఎక్కువగా వుంటాయి.

నిజంగానే కియారా కనుక డేట్లు విచ్చలవిడిగా ఇవ్వలేక పోతే సినిమా షూటింగ్ కి చాల సమస్య అవుతుంది. పైగా త్రివిక్రమ్ చాల స్లోగా సినిమా చేస్తాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, కియారా ఈ సినిమాకి సెట్ కాదు. అందుకే, త్రివిక్రమ్ తన ఆస్థాన హీరోయిన్ పూజా హెగ్డే వైపు ఆసక్తి చూపిస్తున్నాడు. త్రివిక్రమ్ కి పూజా లక్కీ హీరోయిన్ కూడా.