Mahesh-Vijay Multistarrer Movie: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు జోరు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వరుస విజయాలతో దూసుకుపితున్న మహేష్ బాబు ఇటీవల విడుదల సర్కారు వారి పాట సినిమాతో తన కెరీర్ లో మరో సూపర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు నెల నుండి ప్రారంభం కానుంది..ఈ సినిమా పూర్తి అయినా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబొయ్యే సినిమాలో పాల్గొనబోతున్నారు..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపుతున్న మహేష్ బాబు..ఈ రెండు సినిమాలతో పాటుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా అభిమానుల ముందుకి తీసుకొని రాబోతున్నాడట..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తెలుగు లో డైరెక్ట్ గా ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..తెలుగు లో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ప్రముఖ దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఇక ఈ సినిమాలో కథానుసారంగా ఒక్క స్పెషల్ రోల్ ఉంటుంది అట..ఆ రోల్ ని విజయ్ కి సరిసమానమైన ఇమేజి ఉన్న హీరోనే చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ వంశి పైడిపల్లి అభిప్రాయం..అందుకే ఈ రోల్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించాడట వంశి పైడిపల్లి..మహేష్ బాబు తో గతం లో ఆయన మహర్షి వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసాడు..ఈ సినిమా షూటింగ్ సమయం లోనే మహేష్ బాబు తో సోదరసమానమైన సాన్నిహిత్యం ఏర్పడింది వంశి పైడిపల్లికి.
Also Read: Nayanathara wedding: వైరల్ గా నయనతార-విఘ్నేష్ శివన్ ల పెళ్లి.. ఏర్పాట్లు చూస్తే దిమ్మదిరగాల్సిందే!
ఆ చొరవ తోనే మహేష్ బాబు ని అడగగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..ఇక మహేష్ బాబు మరియు విజయ్ కి మధ్య కూడా మంచి స్నేహం ఉండడం తో మహేష్ బాబు మరో ఆలోచనే లేకుండా వెంటనే ఓకే చెప్పేసినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..మహేష్ బాబు కెరీర్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా ఒక్కడు మరియు పోకిరి వంటి సినిమాలను తమిళ్ లో విజయ్ చేసి మంచి మాస్ ఇమేజి ని దక్కించుకున్నాడు..ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఏలుతున్న ఈ ఇద్దరు హీరోలు ఒక్కే సినిమాలో నటిస్తున్నారు అనే వార్త బయటకి రావడం ఇద్దరి హీరోల అభిమానులను కేరింతలు కొట్టేలా చేస్తుంది..ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియచేయనున్నారు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.
Also Read: Kajal Agarwal: పాపం కాజల్ అగర్వాల్..సినిమాల్లో అవకాశాలు కోసం ఏమి చేస్తుందో తెలుసా?