https://oktelugu.com/

Nayanthara Wedding Saree: నయనతార ధరించిన ఆ ఎర్రటి చీర ఎవరు తయారు చేశారు? ధర ఎంతో తెలుసా?

Nayanthara Wedding Saree: ఇప్పుడు ఎక్కడ చూసినా అందాల కుందనపు బొమ్మ నయనతార పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఆమె ఎలాంటి చీర కట్టుకుంది.? పెళ్లి ఎక్కడ జరిగింది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పెళ్లిలో ఏం పెట్టారు? భోజనాల సంగతేంటి? ఇలా అన్నింటిని ఆరాతీస్తున్నారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నయనతార కట్టుకున్న ఎర్రటి చీర అదిరిపోయేలా ఉంది. ఈ చీర ఎక్కడిది? ఎవరు తయారు చేశారు? ఎంత ఖర్చు చేశారు? […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2022 / 06:33 PM IST
    Follow us on

    Nayanthara Wedding Saree: ఇప్పుడు ఎక్కడ చూసినా అందాల కుందనపు బొమ్మ నయనతార పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ఆమె ఎలాంటి చీర కట్టుకుంది.? పెళ్లి ఎక్కడ జరిగింది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పెళ్లిలో ఏం పెట్టారు? భోజనాల సంగతేంటి? ఇలా అన్నింటిని ఆరాతీస్తున్నారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి. ముఖ్యంగా నయనతార కట్టుకున్న ఎర్రటి చీర అదిరిపోయేలా ఉంది. ఈ చీర ఎక్కడిది? ఎవరు తయారు చేశారు? ఎంత ఖర్చు చేశారు? మన దేశంలోనేనా? అని అందరూ ఆరాతీస్తున్నారు.

    Nayanthara Wedding Saree

    సినీ తారల పెళ్లిళ్లు కనువిందుగా ఉంటాయి తెలుగుసహా దక్షిణాదిలో ఇప్పుడు నయనతార-విఘ్నేష్ ల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కలిసి తిరిగారు. విదేశాల్లో ఎంజాయ్ చేశారు.ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

    Also Read: Priyanka Arul Mohan: నాని హీరోయిన్ కి మహేష్ పక్కన ఛాన్స్?

    లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

    తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో పెళ్లి వేడుక అదిరిపోయేలా జరిగింది. నయన్ పెళ్లికి తమిళనాడు కు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజినీకాంత్, సూర్య, అజిత్ తోపాటు బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్, బోనీకపూర్, అట్లీ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

    హోటల్ లోకి బయట వారిని రాకుండా క్యూఆర్ కోడ్ సిస్టం పెట్టి అతిథులకు వారిని అందజేశారు. చివరకు అతిథులకు ఇచ్చే వాటర్ బాటిళ్లు, కర్చీఫ్ లకు కూడా నయన్-విఘ్నేష్ ఫొటోలు ప్రింట్ చేశారు. నయనతార అన్నీ దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశారు.

    Nayanthara Wedding

    ప్రతీదాంట్లోనూ ఆమె ముద్ర వేశారు. ఇక విఘ్నేష్ శివన్ తనకు కాబోయే భార్య నయనతార కోసం 5 కోట్లు వెచ్చి బంగారం, ఉంగరాలు ఇతర పెళ్లి వస్తువులు స్వయంగా కొనుగోలు చేశాడు. ఇక నయనతార ధరించే గద్వాల్ చీర ధర కూడా రూ.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. బంగారు దారాలతో చేసిన ఈ చీరను నయనతార పెళ్లిలో ధరించింది.

    నయనతార ఈ పెళ్లి కోసం ప్రత్యేకంగా ఒక చీరను సిద్ధం చేయించింది. ఆమె పెళ్లిలో ధరించింది మన తెలంగాణలోని ప్రఖ్యాత గద్వాల్ చీర కావడం విశేషం. దీని ధర ఎంత అనుకుంటున్నారు? ఏకంగా రూ.5 లక్షలు. అవును పెళ్లిలో కట్టుకునే చీరనే 5 లక్షలు పెట్టి మరీ డిజైన్ చేయించుకుంది నయనతార.. ఇంత ఖరీదు పెట్టింది ఏమీ ప్రత్యేకత అనుకుంటున్నారా? ఈ ఎర్రటి చీర నిండా బంగారు దారాలతో నేశారు. అందుకే అంత ఖర్చయ్యింది. మన గద్వాల నేతన్నలు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ చీరనే నయనతార కట్టుకోవడం.. ఆ చీరకు అదిరిపోయే స్పందన రావడంతో మన వారి ప్రతిభ ఎల్లలు దాటినట్టైంది. పెళ్లిలో ధరించిన ఎర్రటి చీరలో నయనతార అచ్చం దేవకన్యలానే కనిపిస్తోంది.

    Also Read:Nidhhi Agerwal: నిధి ఎద అందాలు దాచలేకున్న కురచ టాప్… టెంప్టింగ్ ఫోజులతో మెంటల్ తెప్పిస్తున్న పవన్ హీరోయిన్!

    Recommended Videos:


    Tags