https://oktelugu.com/

లీకుల బాధలో మహేష్ సర్కారు.. !

ఒక టాప్ స్టార్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ లీక్ అవ్వడం అంటే.. అదీ తరుచుగా జరుగుతుంది అంటే.. ఇక ఆ సినిమా రిలీజ్ కాకముందే బజారులో ఉన్నట్టు. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాకు సంబంధించిన లీక్ లు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ కి […]

Written By:
  • admin
  • , Updated On : February 9, 2021 / 07:47 PM IST
    Follow us on


    ఒక టాప్ స్టార్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ లీక్ అవ్వడం అంటే.. అదీ తరుచుగా జరుగుతుంది అంటే.. ఇక ఆ సినిమా రిలీజ్ కాకముందే బజారులో ఉన్నట్టు. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాకు సంబంధించిన లీక్ లు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్‌ లొకేషన్‌ కి సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఆ ఫొటోలో మహేశ్‌బాబు తన అసిస్టెంట్స్‌తో ఉండగా.. దర్శకుడు పరశురామ్ మాత్రం మండుటెండలో నేలపై కూర్చొని ఏదో రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

    Also Read: ఎక్స్ క్లూజివ్ : చరిత్ర కారుడిగా బాలయ్య.. పూరి కొత్త కథ !

    దీంతో ఈ ఫొటో కాస్త నెట్టింట్లో బాగా వైరల్‌ అయింది. అంతకు ముందు ఓ వీడియో కూడా ఇలాగే లీక్ అయింది. నిజానికి ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు బయట పడకుండా దర్శకుడు పరుశురామ్ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటునప్పటికీ.. ఈ సినిమా లొకేషన్ ఫోటోలు వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదని, ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారని తెలుస్తోంది. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడట. నమ్రత అనిల్ కపూర్ కలిసి గతంలో ఒక సినిమాలో నటించారు.

    Also Read: టీజర్ టాక్: రైతుల కష్టాలకు చెక్ పెట్టే ‘శ్రీకారం’

    ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ బంధం కారణంగానే అనిల్ కపూర్ మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమాని అంగీకరించాడు. కాగా ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడట. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కథ అని ఇప్పటికే కథ కూడా లీక్ అయింది. కాగా ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్