Modi Birthday: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఆయన ఇప్పటి వరకు చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెసులను సాధించాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మంచి రాబోతున్న ప్రతి ఒక్క అప్డేట్ ని సినిమా ప్రమోషన్ గా వాడుకోవాలనే ఉద్దేశ్యంతో చాలా పకడ్బందీ ప్రణాళికలైతే రూపొందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి అలాగే మహేష్ బాబు ఇద్దరు నరేంద్ర మోడీకి విషెస్ చెబుతూ ఎక్స్ లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు… ముఖ్యంగా రాజమౌళి నరేంద్ర మోడీ గారికి చాలా మంచి విజన్ ఉందని ఆయన పాలనలో చాలా మంచి జరుగుతుందని ఇక మీదట కూడా ఆయన ఇలాగే కంటిన్యూ అవ్వాలని తనకు మంచి హెల్త్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను అంటూ ఆయన వీడియో అయితే చేశారు. ఇక మహేష్ బాబు సైతం మోడీకి బర్త్ డే విసెస్ తెలియజేస్తూనే ఆయన థాట్ ప్రాసెస్ కి ఆయన చేస్తున్న డెవలప్మెంట్ కి తను ఫిదా అయినట్టుగా వీడియోలో అయితే తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఈ ఇద్దరు నరేంద్ర మోడీకి ఇంతకుముందు ఎప్పుడు విషెస్ అయితే తెలియజేయలేదు. కానీ ఈసారి ఇలా వీడియోలతో బర్త్ డే విషెస్ చెప్పడం వెనక చాలా పెద్ద ప్లాన్ ఉందని మరి కొంతమంది భావిస్తున్నారు.
Also Read: నరేంద్ర మోదీ.. ఆయనే ఓ ఇండియన్ బ్రాండ్.. బర్త్ డే వేళ అరుదైన ఫొటోలివీ
నిజానికి రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకి ఇండియాలో అలాగే ఇతర దేశాల్లో కూడా చాలా మంచి క్రేజ్ రావాలంటే వాళ్ళు మోడీని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరమైతే ఉంది. ఇక మోడీ తమ పక్షాన ఉంటే ఇండియాలో ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
టికెట్ రేట్లు పెంచుకోవడానికి గాని, సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేసుకోవాడానికి గాని అన్ని రకాలుగా వాళ్లకు సపోర్ట్ గా ఉంటాడనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇలాంటి ఒక పోస్ట్ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే మోడీ కీ ఇతర దేశాల్లో కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
కాబట్టి రాజమౌళి – మహేష్ బాబు పోస్ట్ చేసిన వీడియోని ఇతర దేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా చూస్తారు. తద్వారా వీళ్ళ సినిమాకి అది కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఒక పెద్ద ప్లాన్ వేసి ఆయన చెప్పడమే కాకుండా మహేష్ బాబు చేత బర్త్ డే బర్త్డే విషెస్ చెప్పించి ఆ వీడియోను పోస్ట్ చేశాడు అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు…
Happy Birthday to our honourable Prime Minister Shri @narendramodi Ji. May you always be blessed with good health, happiness and continue inspiring us all with your leadership. pic.twitter.com/hBKEnKGtVx
— Mahesh Babu (@urstrulyMahesh) September 17, 2025