GST 2.0 effect on car prices: GST 2.0 కారణంగా సెప్టెంబర్ 22 నుంచి చాలా వరకు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే తెలుస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కొన్ని వస్తువులపై జిఎస్టిని తగ్గించడంతో ధరలు అదుపులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో కార్లు కొనేయాలని అనుకునే వారికి ఆయా కంపెనీలు శుభవార్తలు తెలుపుతున్నాయి. జీఎస్టీ కారణంగా కార్ల ధరలు భారీగా తగ్గుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో కారుపై దాదాపు లక్ష నుంచి 1,50,000 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ కారుపై ఎంత తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం.
మారుతి సుజుకి:
మధ్యతరగతి వారు కారు కొనాలనుకుంటే మారుతి సుజుకి కంపెనీ వైఫై చూస్తారు. ఈ కంపెనీ కార్లు తక్కువ ధరతో పాటు మంచి ఫీచర్స్ అందిస్తాయి. మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్, వ్యాగన్ఆర్ కార్లు ఎవర్గ్రీన్గా నిలిచాయి. ఈ కార్ల ధరలు ఇప్పటికే తక్కువగా ఉంటాయి. కానీ జీఎస్టీ కారణంగా మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి Swift కారుపై.1.06 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆల్టో k10 రూ.53,000.. ఎస్ presso రూ. 53,000.. వ్యాగన్ఆర్ పై రూ.64,000 దగ్గర ఉన్నాయి.
టాటా మోటార్స్:
మారుతి సుజుకీ కంపెనీ తరువాత ఎక్కువగా టాటా కార్లపైనే మోజు పెంచుకుంటారు. వినియోగదారులకు అనుగుణంగా ఈ కంపెనీ కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే జీఎస్టీ 2.0 కారణంగా ఈ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ కంపెనీకి చెందిన టియాగో రూ.75,000.. టిగోర్ రూ.80,000.. అల్ట్రోస్ పై రూ.1.1 లక్షలు.. పంచ్ పై రూ.85,000 తగ్గనున్నాయి. గరిష్టంగా సఫారీ వెహికల్ పై రూ.1.45 లక్షలు తగ్గే అవకాశం ఉంది. ఇక కర్వ్ వాహనంపై రూ.65 వేల వరకు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
హ్యుందాయ్:
ఈ కంపెనీకి చెందిన ఎక్స్ టర్ రూ.89,000 తగ్గనుంది. వెన్యూపై అత్యధికంగా రూ.1.23 లక్షలు తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. అలాగే నియోన్ పై రూ.73,000.. ఐ20 ఎన్ లైన్ రూ.1.08 లక్షలు తగ్గించనున్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా:
దేశంలో టాప్ కార్ల కంపెనీల్లో మహీంద్రా ఒకటి. ఈ కంపెనీకి చెందిన థార్ రూ.1.35 లక్షల వరకు తగ్గనుంది. అలాగే XUV 3X0పై రూ.1.56 లక్షలు తగ్గించే అవకాశం ఉంది. స్కార్పియో రూ.1.01 లక్షలు, XUV 700 పై రూ.1.43 లక్షల తగ్గింపు ఉంటుంది.
స్కోడా:
స్కోడా కంపెనీకి చెందిన కైలాకళ్ రూ.1.19 లక్షలు, కోడియాక్ పై రూ.3.30 లక్షలు, కుషాక్ పై రూ.66 వేల తగ్గింపు ఉండనుంది.
టయోటా:
ఈ కంపెనీకి చెందిన ఫార్చునర్ కారుపై అత్యధికంగా రూ.3.49 లక్షలు తగ్గే అవకాశం ఉంది. అలాగే హైలక్స్ పై రూ.2.52 లక్షలు, వెల్ ఫేర్ రూ.2.78 లక్షలు.. ఇన్నోవా క్రిష్టా రూ.1.08 లక్షలు తగ్గనుంది. అలాగే ఇన్నోవా హైక్రాస్ పై రూ.1.15 లక్షలు తగ్గతుంది.
ఫోక్స్ వ్యాగన్ :
టిగువాన్ ఆర్ అనే కారుపై అత్యధికంగా రూ.3.26 లక్షలు, విర్టన్ పై రూ.66,000 రూ.టైగన్ పై రూ.68,000 తగ్గే ఛాన్స్ ఉంది.
కియా:
కియాకు చెందిన సెల్టోస్ కారుపై రూ.75,000.. సైరోస్ రూ.1.86 లక్షలు తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కరెన్స్ క్లావిస్ రూ.78,000 తగ్గనుంది.