Spiritual trip donation: అన్నదానం గురించి తెలుసు.. వస్త్ర దానం గురించి వినే ఉంటారు.. విద్యా దానం చేసే ఉంటారు.. కానీ యాత్ర దానం గురించి ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎవరికైనా యాత్ర దానం చేశారా? యాత్ర దానం గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది. కానీ చాలామందికి దీని గురించి తెలియదు. సాధారణంగా విరామం దొరికినప్పుడు మనం యాత్రలకు వెళుతూ ఉంటాం. విహారయాత్రలకు వెళ్లినప్పుడు మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మానసికంగా రిప్రెష్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఇలా మరొకరి మనసును ఉల్లాసంగా ఉంచేందుకు.. వారిని విహారయాత్రలకు పంపేందుకు చేసే ఏర్పాట్లే యాత్ర దానం. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎంతోమందికి విహారయాత్రలకు వెళ్లాలని ఉంటుంది. డబ్బు తక్కువగా ఉన్నవారు సైతం ఎప్పుడో ఒకసారి కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో కలిసి దగ్గర ప్రదేశాలకు వెళ్లి హాయిగా కడుపుతో ఉంటారు. ఏ సమయంలో అనాథలకు కూడా విహారయాత్రలకు వెళ్లాలని ఉంటుంది. అలాగే వృద్ధులకు కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలని ఉంటుంది. కానీ వీరిని తీసుకెళ్లడానికి ఎవరూ ఒప్పుకోరు. అయితే ఇతరులకు అన్నదానం చేసినట్లే.. ఇలాంటి వారి విహారయాత్రలకు ఖర్చు చేస్తే దానిని యాత్ర దానం అంటారు. యాత్ర దానం పేరిట ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఎవరైనా యాత్ర దానం చేయాలని అనుకుంటే ఆర్టీసీని సంప్రదించి అనాథలు లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది. ఎక్కడినుంచి ఎక్కడికి విహారయాత్రలకు తీసుకెళ్తారో లేదా బుకింగ్ చేసుకుంటారు.. ఏడు రోజుల ముందే ఆర్టీసీకి తెలియజేయాలి. ఎవరైతే బుక్ చేస్తున్నారు వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమందిని తీసుకెళ్తున్నారు చెబితే వారికి బస్సును ఆర్టీసీ కల్పిస్తుంది.
అయితే కొందరికి యాత్ర దానం చేయాలని ఉంటుంది. కానీ ప్రత్యేకంగా సమయం ఉండదు. ఇలాంటి వారు కేవలం డబ్బులు చెల్లిస్తాను అంటే.. కూడా ఆర్టీసీ డబ్బులు తీసుకొని మిగతా సౌకర్యాలని కల్పిస్తుంది. ఈ యాత్రలోనే భోజనం వసతి కూడా కల్పిస్తుంది. అన్నింటికీ కలిపి ఒక ధరను నిర్ణయించి చెబుతోంది. ఇలా ఎవరికైనా యాత్ర దానం చేయాలని అనుకుంటే ఆర్టీసీని సంప్రదించి చేయవచ్చు.
ఎంతోమంది ఎన్నో రకాల సాయం చేస్తుంటారు. ఇలా ఎదుటివారి మనసులో ఉల్లాసపరిచేందుకు యాత్ర దానం చేయడం వల్ల వారు ఎంతో హాయిగా ఉండగలుగుతారు. అంతేకాకుండా జీవితాంతం వారు గుర్తుపెట్టుకుంటారు.. అందువల్ల అప్పుడప్పుడు అన్నదానాలు, వస్త్రధానాలు మాత్రమే కాకుండా ఇలా యాత్ర దానం చేసి కూడా పుణ్యం కట్టుకోవచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారిని ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు సాయం చేయడం వల్ల వారు ఎన్నో రకాల మంచి మనసుతో ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటారు. అందువల్ల మీరు కూడా యాత్ర దానం చేయాలని అనుకుంటే ఆర్టీసీని సంప్రదించవచ్చు.