IPL 2024: SRH vs GT మ్యాచ్ రద్దవ్వడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ కి వెళ్ళింది… కానీ భారీ గా నష్టపోయింది…

హైదరాబాద్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి నెక్స్ట్ పంజాబ్ మీద ఆడే మ్యాచ్ లో కూడా గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 పోజిషన్ లో ఉండేది.

Written By: Gopi, Updated On : May 17, 2024 2:45 pm

SRH vs GT match cancelled

Follow us on

IPL 2024, SRH vs GT: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ఈ సీజన్ లో జరుగుతున్న మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే మూడు టీములు ప్లే ఆఫ్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక ప్లే ఆఫ్ కు చేరుకోవాల్సిన మరొక టీమ్ ఏది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో రెండు టీమ్ లకి చేరో పాయింట్ ఇచ్చారు. అయితే 15 పాయింట్లతో హైదరాబాద్ టీం ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది.

అయితే వర్షం కారణంగా గుజరాత్ తో ఆడాల్సిన మ్యాచ్ రద్దు అవ్వడం అనేది హైదరాబాద్ టీం కి భారీ నష్టం కలిగించిందనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి నెక్స్ట్ పంజాబ్ మీద ఆడే మ్యాచ్ లో కూడా గెలిస్తే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 పోజిషన్ లో ఉండేది. నిజానికి ఐపీఎల్లో ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయిన టీముల్లో మొదటి రెండు టీం లకి ఎక్స్ ట్రా గా ఒక మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉంటుంది. అంటే వీళ్ళు మొదటగా క్వాలిఫైయర్ మ్యాచ్ గా ఒక మ్యాచ్ ఆడతారు. ఇక క్వాలిఫైయర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన టీం తో క్వాలిఫైయర్ వన్ లో ఓడిపోయిన టీం మరొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

అంటే మొదటి రెండు ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ ట్రా గా ఒక మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉంటుంది.
కాబట్టి ప్లే ఆఫ్ కి వచ్చే టీమ్ లు అన్ని కూడా మొదటి రెండు ప్లేస్ లో ఉండడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ టీం సెకండ్ పొజిషన్ కి వచ్చే అవకాశాలు లేవా అంటే ఒక రకంగా చూస్తే ఉన్నాయి.

కానీ వాటి కోసం మిగతా జట్ల మీద ఆధారపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక హైదరాబాద్ టీమ్ పంజాబ్ మీద ఆడే మ్యాచ్ లో గెలవడమే కాకుండా, చెన్నై మీద ఆర్సిబి గెలవాల్సి ఉంటుంది. అలాగే రాజస్థాన్ మీద కలకత్తా గెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగితే అప్పుడు హైదరాబాద్ సెకండ్ పొజిషన్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. గుజరాత్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవ్వడం వల్ల హైదరాబాద్ ప్లే ఆఫ్ కైతే వెళ్ళింది. కానీ ఒక రకంగా హైదరాబాద్ కి అన్యాయం జరిగిందనే చెప్పాలి…