Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్.. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఒకప్పుడు టీమిండియాకు ప్రధాన స్పిన్నర్. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఓ వెలుగు వెలిగాడు. అతడు చెప్పినట్లు బౌలింగ్ చేసి తన పదును పెంచుకొని ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టేవాడు. ధోని రిటైర్ అయ్యాక ఇతడికి అవకాశాలు రాలేదు. టీంకు ఎంపికైనా కూడా తుది జట్టులో కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కేది కాదు. ఐపీఎల్ లో అయితే కుల్దీప్ ను టీం యాజమాన్యాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడూ బెంచ్ లోనే కూర్చోబెట్టేవి.
గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆడిన కుల్దీప్ ను అప్పటి కెప్టెన్ గౌతం గంభీర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు. అతడి కెప్టెన్సీలోనూ మెరుగ్గా రాణించాడు. 2017,18 సీజన్లలో 29 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే గంభీర్ రిటైర్ మెంట్ తర్వాత కేకేఆర్ పూర్తిగా కుల్దీప్ ను పక్కనపెట్టింది. అసలు వాడుకోవడమే మానేసింది. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ల రాకతో కుల్దీప్ యాదవ్ ను కేకేఆర్ పూర్తిగా బెంచ్ కే పరిమితం చేసింది.
Also Read: KCR Politics on Petrol Price Hike: పెట్రోల్ ధర తగ్గాలంటే ఏం చేయాలి?
కేకేఆర్ తనకు తుదిజట్టులో చోటు ఇవ్వకపోతే వేలానికి అయినా వదిలేయాలని కుల్దీప్ మొత్తుకున్నా యాజమాన్యం ఇతడి మొర ఆలకించలేదు. వదిలిపెట్టలేదు.
అయితే ఐపీఎల్ 2022 మెగా వేలంలో కుల్దీప్ యాదవ్ ని రూ.2 కోట్లకు కొన్న ఢిల్లీ కేపిటల్స్ అతడిని అక్కున చేర్చుకుంది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి కుల్దీప్ అదరగొట్టారు. ‘కుల్దీప్ యాదవ్ మరోసారి మ్యాచ్ విన్నర్ గా నిరూపించుకున్నాడు. కుల్దీప్ లాంటి ప్లేయర్ ను సరిగ్గా వాడుకోవాలి.. అతను చాలా ఎమోషనల్ అని క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు.
కుల్దీప్ యాదవ్ ను ఎలా వాడుకోవాలో కొత్తగా కొన్ని ఢిల్లీ క్యాపిటల్స్ నిరూపించిందని.. అతడిని మ్యాచ్ విన్నర్ గా నిలిపిందని సీనియర్ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మెచ్చుకున్నాడు. అదే కేకేఆర్ చేయలేక అతడిని బెంచ్ లో కూర్చొబెట్టిందని విమర్శించింది. ఏ ప్లేయర్ తో అయినా అలా ప్రవర్తిస్తే మ్యాచ్ విన్నర్లు కూడా ఒత్తిడికి గురవుతారని కైఫ్ అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ లో కుల్దీప్ యాదవ్ కు ఇప్పుడా ఒత్తిడి లేదని కైఫ్ అన్నాడు. అతడికి కావాల్సిన మెంటల్ స్ట్రెంగ్త్ ను కోచ్ రికీ పాటింగ్ అండ్ టీం అందించాడని తెలిపారు. కోల్ కతా నైట్ రైడర్స్ ఇదే చేయలేకపోయిందని చెప్పుకొచ్చాడు.
Also Read: Prabhas Salaar Movie Shooting Postponed: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూసే