Homeఎంటర్టైన్మెంట్Mahesh Movie: త్రివిక్రమ్ కి అది పెద్ద తలనొప్పి అయిపోయింది !

Mahesh Movie: త్రివిక్రమ్ కి అది పెద్ద తలనొప్పి అయిపోయింది !

Mahesh Movie Turned Out To Be A Big Headache For Trivikram

Mahesh Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు అనాగనే ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక త్రివిక్రమ్ కి పెద్ద సమస్య అయిపోయింది. ఒక పక్క పుష్ప సినిమాలో బాలీవుడ్ నటులు, అలాగే మలయాళ ఇండస్ట్రీ నటులు నటిస్తున్నారు. మరి మహేష్ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ లేకపోతే బాగోదు అని డిస్ట్రీబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారట.

మహేష్ వైపు నుంచి కూడా బాలీవుడ్ స్టార్ కాస్ట్ ను తీసుకోమని మెసేజ్ వచ్చింది. కానీ, బాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న ఏ నటుడు ప్రస్తుతం వరుసగా పది రోజులు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు అట. సంజయ్ దత్ నుంచి.. సునీల్ శెట్టి వరకు అందరూ బిజీగా ఉన్నారని త్రివిక్రమ్ కి ఆన్సర్స్ వచ్చాయి. దాంతో త్రివిక్రమ్ కి ఈ నటులు ఎంపిక అనేది పెద్ద తలనొప్పి అయిపోయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరోపక్క పాత్రలకు తగట్టు నటినటులను ఎంపిక చేస్తున్నాడు. చిన్నాచితకా పాత్రలకు నటులను ఎంపిక చేశారు. కీలక పాత్రల కోసం స్టార్స్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాని రాజకీయ నేపథ్యంలో సాగే కేజిఎఫ్ రేంజ్ భారీ యాక్షన్ సినిమాగా తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు ఓ గ్యాసిప్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా నేటి రాజకీయాలను కూడా త్రివిక్రమ్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట. ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని, అందులో ఒక హీరోయిన్ ను క్రేజీ బ్యూటీ పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version