Mahesh Babu- Prabhas Mahabharatam: వాల్మీకి రాసిన రామాయణం, వ్యాసుడు రచించిన మహాభారతం సినిమాటిక్ సబ్జక్ట్స్. ఈ భారతీయ ఇతిహాసాలపై అనేక చిత్రాలు తెరకెక్కాయి. వివిధ కోణాల్లో దర్శకులు ఈ సబ్జెక్ట్స్ టచ్ చేశారు. ముఖ్యంగా మహాభారతం అతిపెద్ద మల్టీస్టారర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్టు. అర్జునుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు, భీముడు ఇలా అరడజను వరకు హీరోయిజంకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే పాత్రలు ఉన్నాయి. దుర్యోధనుడు వారందరికీ సవాల్ విసరగల విలన్ గా చెప్పుకోవచ్చు. నేటి సాంకేతికత, స్టార్ క్యాస్ట్ ఉపయోగించి మహాభారతం తెరకెక్కిస్తే కనీసం వేయి కోట్ల బడ్జెట్ కావాలి.

రెండు మూడు భాగాలుగా తెరకెక్కిస్తే కానీ ఆ సబ్జెక్టుకి న్యాయం చేయలేము. రాజమౌళి మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఆ సినిమాను నేను ఊహించిన స్థాయిలో తెరకెక్కించే అనుభవం, పరిపక్వత ఇంకా నాకు రాలేదు. భవిష్యత్ లో ఖచ్చితంగా చేస్తానని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తరచుగా భారీ బడ్జెట్ తో మహాభారతం తెరకెక్కిస్తున్నామంటూ ప్రకటనలు వస్తూ ఉంటాయి. చాలా వరకు కార్యరూపం దాల్చవు.
ఇక పౌరాణిక సబ్జక్ట్స్ తెరకెక్కించాలంటే సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ తర్వాతే అనే నానుడి ఉంది. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ ఆదిపురుష్ టైటిల్ తో రామాయణం తెరకెక్కిస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో బాలీవుడ్ మేకర్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ కలిసి మహాభారతం మూవీ చేస్తే ఎలా ఉంటుంది. ఎవరికి ఏ పాత్ర సరిపోతుందనే ఊహాగానాలతో ఒక వీడియో చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఓ సినిమా లవర్ మహేష్, ప్రభాస్, సూర్య, విక్రమ్, కమల్, రజినీకాంత్ ఇలా సౌత్ స్టార్స్ అందరినీ మహాభారత పాత్రల్లో మార్ఫ్ చేసి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ప్రకారం… మహేష్ కి కృష్ణుడు, ప్రభాస్ కి దుర్యోధనుడు రోల్స్ ఇచ్చారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ని హీరో విలన్ చేశారు. ఇక సూర్య-అర్జునుడు, విక్రమ్-కర్ణుడు అట. కమల్,రజినీకాంత్ లకు భీష్ముడు, ద్రోణాచార్యుడు పాత్రలు ఇచ్చారు. హీరో కార్తీని శకుని చేశారు. కీలక లేడీ క్యారెక్టర్స్ ద్రౌపదిగా అసిన్, కుంతీదేవిగా అనుష్కను ఎంచుకున్నారు. ఈ సోషల్ మీడియా వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి
“My father & I started the writing work for my next film #SSMB29, it will be an ADVENTURE movie” Telugu
– Director #SSRajamouli 🔥🔥#SSMB29 after #Mahabharat movie 😍#Adipursh@urstrulyMahesh @PrabhasRaju @actorvijay @Suriya_offl @ActorMadhavan @actor_jayamravi pic.twitter.com/AYTSyzDyJs— global🌎 maheshbabu💖prabhas🫶Trend 📈 (@k_gudurpraveen) November 20, 2022