Trivikram: భారీ అంచనాలతో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో మహేష్ బాబు అద్భుతమైన పర్ఫామెన్స్ ను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. దానికి తగ్గట్టుగానే ఆయన చాలా కష్టపడుతూ ఈ సినిమాలో సూపర్ డాన్సులు కూడా చేశాడు. నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని అందరు అనుకున్నారు కానీ అందరూ ఊహలను తలకిందులు చేస్తూ ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడం విశేషం…
ఇక ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అని మరొక టాక్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా మహేష్ బాబు స్టాండర్డ్ కి తగ్గట్టుగా లేదంటూ కొందరు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి కానీ ఈ సినిమా అంత లేదు అంటూ వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మహేష్ అభిమానులు పండుగ చేసుకునేవాళ్లు సంక్రాంతికి ముందే వచ్చిన ఈ సినిమా పండగ తీసుకొస్తుందనుకుంటే తీవ్రమైన బాధను తీసుకొచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొన్ని థియేటర్లలో అభిమానులు అయితే సినిమా మధ్యలోనే బయటకు వచ్చేసి త్రివిక్రమ్ ఎక్కడున్నాడు అంటూ కోపానికి వస్తున్నారు. ఇంక కొంతమందికి ఆయన కోసం తిరుగుతూ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఇలాంటి సినిమా ఎందుకు చేశావ్ అని అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ని త్రివిక్రమ్ ఫూల్స్ ని చేశారనే చెప్పాలి. ఈ సినిమా కోసం వాళ్ళు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
త్రివిక్రమ్ అంటే ఒక నమ్మకం ఉండడంతో ఈ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేస్తాడనే కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ త్రివిక్రమ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా సినిమాలో తనకు నచ్చినట్టుగా సీన్లు రాసుకొని ఏ మాత్రం ప్రేక్షకుడిని ఆకట్టుకాకుండా దారుణంగా ఫెయిల్ అయ్యేలా చేశాడనే చెప్పాలి. అందుకే ఈ సినిమా మీద రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి కానీ సినిమా చూసిన తర్వాత అసలు ఇది సినిమా నేనా అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…