https://oktelugu.com/

Trivikram Srinivas: మొన్న అత్త, నిన్న నాన్న, ఈ రోజు అమ్మ త్రివిక్రమ్ కథలు ఇవే…

నిజానికి త్రివిక్రమ్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఇలాంటి అవుట్ డేటెడ్ కథల్లో ఒక స్టార్ హీరోని చూపించాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ మరికొందరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 13, 2024 / 10:54 AM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా మీద ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండేవి. అయితే ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన హీరో అయిన మహేష్ బాబును ఇంత దారుణమైన స్టోరీ లో చూపించినందుకు త్రివిక్రమ్ మీద మహేష్ అభిమానులు విపరీతమైన కోపంతో ఉన్నారు.

    నిజానికి త్రివిక్రమ్ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఇలాంటి అవుట్ డేటెడ్ కథల్లో ఒక స్టార్ హీరోని చూపించాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ మరికొందరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇంతకుముందు త్రివిక్రమ్ తీసిన అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో సినిమాలను కలగలిపి ఈ సినిమా తీసినట్టుగా ఉంది అంటూ మరికొందరు ప్రేక్షకులు వాళ్ల అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు.

    నిజానికి త్రివిక్రమ్ లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఒక మంచి కథ రాసుకొని సినిమా చేయాలి కానీ ఖచ్చితం గా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. కానీ ఎందుకు మరి తను ఇలాంటి ఒక నాసిరకం సినిమాలను ప్రేక్షకులు ముందుకు తెస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎప్పుడు అదే ఫ్యామిలీ సినిమాల చుట్టూ తిరిగే స్టోరీని ఎంచుకొని అత్తారింటికి దారేది లో అత్త అంటాడు, అలా వైకుంఠపురం లో అమ్మ , సన్నాఫ్ సత్యా మూర్తి లో నాన్న, గుంటూరు కారం లో అమ్మ ఇలాంటి కథలను ఎంచుకొని అక్కడక్కడే స్టోరీ ని తిప్పుతూ అవే సినిమాలు చేస్తూ ఎందుకు జనాలను ఇబ్బంది పెడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన సినిమా అయిన అలా వైకుంఠపురంలో సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కొట్టింది. మరి మహేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎందుకు ఇలాంటి సినిమాలు అందిస్తున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు.

    మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దొరికినప్పుడు ఒక మంచి మాస్ మసాలా సినిమాను తీసిన కూడా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పక్క అనేది ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేశారు. అయినప్పటికీ త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఎందుకు ఒక భారీ సక్సెస్ ని కొట్టలేకపోతున్నాడు అనేది ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… ఇక వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పటికే వీళ్ళ కాంబో లో మూడు సినిమాలు వస్తే మూడు సినిమాల్లో అతడు యావరేజ్ గా ఆడినప్పటికీ ఖలేజా, గుంటూరు కారం సినిమాలు మాత్రం దారుణమైన డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి…