Agnyaathavaasi Vs Guntur Kaaram: గుంటూరు కారం కంటే అజ్ఞాత వాసి చాలా బెటర్…

2018 లో సంక్రాంతికి వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని గుర్తు చేసుకుంటూ అప్పుడు పవన్ కళ్యాణ్ ని అతని ఫ్యాన్స్ ని ఫూల్స్ ను చేశావ్. ఇప్పుడు మా మహేష్ బాబుని మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావ్. అజ్ఞాతవాసి కంటే కూడా గుంటూరు కారం సినిమాను భారీ డిజాస్టర్ గా తీశాడు.

Written By: Gopi, Updated On : January 13, 2024 10:32 am

Agnyaathavaasi Vs Guntur Kaaram

Follow us on

Agnyaathavaasi Vs Guntur Kaaram: ఈరోజు రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాని చూసిన మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి ఒక నాసిరకం సినిమాని తీశాడు.మహేష్ బాబు తో ఒక బెస్ట్ ప్రోడక్ట్ ని తీస్తాడు అనుకుంటే అసలు కథే లేని ఒక సినిమాను తీసి జనాలను ఫూల్ చేశాడు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద అభిమానులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే 2018 లో సంక్రాంతికి వచ్చిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని గుర్తు చేసుకుంటూ అప్పుడు పవన్ కళ్యాణ్ ని అతని ఫ్యాన్స్ ని ఫూల్స్ ను చేశావ్. ఇప్పుడు మా మహేష్ బాబుని మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావ్. అజ్ఞాతవాసి కంటే కూడా గుంటూరు కారం సినిమాను భారీ డిజాస్టర్ గా తీశాడు. దీంతో పోల్చుకుంటే అజ్ఞాతవాసి సినిమాలో ఒక మంచి కథ ఉంటుంది. దీంట్లో ఆ కథ కూడా లేదు అంటూ వాళ్ళు అజ్ఞాతవాసి సినిమాను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు.

నిజానికి ఈ సినిమా మీద గురూజీ ఎక్కువ కన్సెన్ ట్రెట్ చేయనట్టుగా కనిపిస్తుంది. అప్పుడు అజ్ఞాతవాసి సినిమా విషయంలో కూడా అదే పని చేశాడు ఇప్పుడు గుంటూరు సినిమా విషయంలో కూడా అదే పని చేశాడు. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఇద్దరినీ కూడా నిరాశ పరిచడానే చెప్పాలి. ఎందుకు గురూజీ ఇలాంటి ఒక డిజాస్టర్ సినిమాలను ఇస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఈయన గత చిత్రమైన అలా వైకుంఠపురం లో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ మహేష్ బాబు దగ్గరికి వచ్చేసరికి మాత్రం మళ్లీ తడపడ్డాడు ఇక మహేష్ తో మూడు సినిమాలు చేస్తే అందులో అతడు యావరేజ్ అవ్వగా, ఖలేజా ప్లాప్ అయింది కానీ బాగుంటుంది. ఇక గుంటూరు కారం మాత్రం రాడ్ సినిమా అనే చెప్పాలి.ఇక గురూజీ తో సినిమాలు చేయడం వేస్ట్ అని చాలా మంది హీరోలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికైతే మహేష్ బాబుకు గుంటూరు కారం సినిమాతో మరొక డిజాస్టర్ ని మహేష్ ఖాతా లో వేశాడు.