NTR, Krishna, Teja : రక్తం పంచుకుని పుట్టిన కొడుకు మరణాన్ని ఏ తండ్రి తట్టుకోలేడు. అందుకే బిడ్డ మరణం మనిషి జీవితంలో అత్యంత భయంకరమైన విషాద సంఘటన అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు.
హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి చనిపోయాక ఆయన ఆత్మను కొడుకు శాంతింపజేయాలి, కానీ, అదే చనిపోయిన కొడుకు ఆత్మ ఘోషను ఏ తండ్రి గుండె శాంతింపజేయలేదు. ఎందుకంటే ముందు ఆ గుండె తట్టుకోలేదు. ఆ తండ్రి గుండెను ఓదార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రియమైన కుమారుడి మరణం ఎన్నటికీ మరచిపోలేని విషాద మయమే.
దురదృష్టవశాత్తు తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు సినీ ప్రముఖులు కొడుకు మరణాన్ని కళ్ల ముందే చూడాల్సి వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు కన్నుమూసారు. అది చూసి కృష్ణ కన్నీళ్లు పెట్టుకుని తల్లడిల్లిపోతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో కొడుకులను పోగొట్టుకొని తల్లడిల్లిపోయిన తండ్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ :
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చిన్న వయసులోనే అరుదైన వ్యాధి వచ్చి కన్నుమూసారు. రామకృష్ణ మరణాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత పుట్టిన కొడుకుకు రామకృష్ణ జూనియర్ అని పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్.
నందమూరి హరికృష్ణ :
హరికృష్ణకు కూడా పుత్రశోకం తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కానీ హరికృష్ణ కూడా అలాగే యాక్సిడెంట్‌లోనే చనిపోవడం దురదృష్టకరం.
సీనియర్ రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు :
పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రఘుబాబు కూడా అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయారు.
కోట శ్రీనివాసరావు ;
కోట శ్రీనివాసరావుకు కూడా పుత్ర శోకం తప్పలేదు. కోట కొడుకు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ కోట కొడుకునే తల్చుకుని కుమిలిపోతూ ఉంటారు.
బాబు మోహన్ :
సీనియర్ హాస్య నటుడు బాబు మోహన్ కూడా కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఆయన కుమారుడు పవన్ కుమార్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు.
గొల్లపూడి మారుతీరావు :
దివంగత నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాస్ కూడా చిన్న వయసులోనే చనిపోయారు. అజిత్ మొదటి సినిమా ప్రేమ పుస్తకం షూటింగ్ లో గొల్లపూడి కుమారుడు చనిపోవడం బాధాకరమైన విషయం. 26 ఏళ్ళకే శ్రీనివాస్ మరణించాడు.
దర్శకుడు తేజ :
దర్శకుడు తేజ కుమారుడు కూడా కేవలం ఆరేళ్ళ వయసులోనే అనారోగ్యంతో చనిపోయాడు.
ప్రకాష్ రాజ్ :
ప్రకాష్ రాజ్ కూడా తన తనయుడి మరణాన్ని తట్టుకోలేక పోయాడు. ప్రకాష్ రాజ్ కుమారుడు కూడా చిన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోయాడు.
ప్రభుదేవ :
Also Read:Ramesh Babu death: రమేష్ బాబు మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం..!
ప్రభుదేవ తనయుడు సైతం చిన్న వయసులోనే చనిపోయాడు. కొడుకు మరణం తర్వాతే ప్రభుదేవాకి ఆయన భార్య రమా లతా కి మధ్య గొడవలు వచ్చాయి. ఏది ఏమైనా కళ్ల ముందు బిడ్డలు చనిపోవడం శాపం. జీవితాంతం ఆ బాధ బాధిస్తూనే ఉంటుంది.
Also Read: Ramesh Babu: హీరో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత