https://oktelugu.com/

మహేష్ షరతులు.. ఫీల్ అవుతున్న నిర్మాత !

‘సూపర్ స్టార్ మహేష్ బాబు’తో సినిమా చేయాలంటే రెండు షరతులు ఉంటాయి. ఒకటి రెమ్యునరేషన్, రెండు స్క్రిప్ట్ విషయం. ఈ రెండిటిలో మహేష్ దే ఫైనల్ నిర్ణయం. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమా విషయంలోనూ మహేష్ ఈ రెండు పక్కాగా ఫాలో అయ్యాడు. అయితే త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయంలో మహేష్ మరో అదనపు షరతు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. […]

Written By:
  • admin
  • , Updated On : July 11, 2021 4:42 pm
    Follow us on

    ‘సూపర్ స్టార్ మహేష్ బాబు’తో సినిమా చేయాలంటే రెండు షరతులు ఉంటాయి. ఒకటి రెమ్యునరేషన్, రెండు స్క్రిప్ట్ విషయం. ఈ రెండిటిలో మహేష్ దే ఫైనల్ నిర్ణయం. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమా విషయంలోనూ మహేష్ ఈ రెండు పక్కాగా ఫాలో అయ్యాడు. అయితే త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయంలో మహేష్ మరో అదనపు షరతు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ఆ షరతు ఏమిటంటే.. సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలనే నిర్ణయం కూడా, ఇక నుండి తన సినిమాల వరకు మహేషే తీసుకుంటాడట. మరి నిర్మాతలు ఏమి చేయాలి ? డబ్బులు పెట్టాలి. కొన్ని ఐడియాలను మహేష్ తో పంచుకోవచ్చు. అలాగే మిగిలిన టీమ్ లోని వ్యక్తులను డీల్ చేసుకోవాలి. అంటే, ఒక మేనేజర్ పని నిర్మాత చేయాలి అన్నమాట.

    ఇక్కడే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చిన్నబాబుకు ఇది అసలు రుచించడం లేదు. తానూ ఎవరితో సినిమా చేసినా సినిమా రిలీజ్ వ్యవహారం అనేది తన చేతుల్లోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు. అసలు మహేష్ తో చేయబోయే చిత్రాన్ని తన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ పై భారీగా నిర్మిస్తున్నాడు. లాభాలు కంటే కూడా భారీ తనమే ముఖ్యం అనుకుని సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.

    అయినా, మహేష్ ఇలా అనవసరపు షరతులు పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాగాలేదు అని చిన్నబాబు ఫీల్ అవుతున్నాడట. నిజానికి మహేష్ ఈ చిత్రం కోసం మొదట దాదాపు 55 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద అడిగాడు. బేరసారాలు ముగిసిన తర్వాత 45 కోట్లు దగ్గర మహేష్ ఓకే చెప్పాడు. కానీ ఆ తర్వాత సినిమాలో భాగస్వామ్యం అంటూ నిర్మాణంలోకి కూడా ఎంటర్ అయ్యాడు.

    ఇక అప్పటి నుండి సినిమాకి సంబంధించిన ప్రతి నిర్ణయం తనేదే ఫైనల్ అన్నట్టు ఉంది మహేష్ వ్యవహారం. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.