మీ హీరో కూడా పోతాడు.. ఫ్యాన్స్ ను గెలికిన శ్రీరెడ్డి

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్ మృతి సినీ లోకంతోపాటు అంద‌రినీ షాక్ కు గురిచేసింది. సినీ జ‌ర్న‌లిస్టుగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత క్రిటిక్ గా స‌త్తా చాటారు. అయితే.. శ్రీరాముడిపై వ్యాఖ్య‌లు చేయ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌ను డైరెక్ట్ గా టార్గెట్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో ఆయ‌న వివాదాస్ప‌దం అయ్యారు. అదే స‌మ‌యంలో ఫేమ‌స్ కూడా అయ్యారు. ఆ త‌ర్వాత నుంచి చర్చా వేదిక‌ల్లోనూ ఇవే త‌ర‌హా వ్యాఖ్య‌లు కొన‌సాగించ‌డంతో ర‌చ్చ […]

Written By: Rocky, Updated On : July 12, 2021 10:43 am
Follow us on

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్ మృతి సినీ లోకంతోపాటు అంద‌రినీ షాక్ కు గురిచేసింది. సినీ జ‌ర్న‌లిస్టుగా ప్ర‌యాణం మొద‌లు పెట్టిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత క్రిటిక్ గా స‌త్తా చాటారు. అయితే.. శ్రీరాముడిపై వ్యాఖ్య‌లు చేయ‌డం, ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌ను డైరెక్ట్ గా టార్గెట్ చేయ‌డం వంటి కార‌ణాల‌తో ఆయ‌న వివాదాస్ప‌దం అయ్యారు. అదే స‌మ‌యంలో ఫేమ‌స్ కూడా అయ్యారు. ఆ త‌ర్వాత నుంచి చర్చా వేదిక‌ల్లోనూ ఇవే త‌ర‌హా వ్యాఖ్య‌లు కొన‌సాగించ‌డంతో ర‌చ్చ పెర‌గ‌డం.. హైద‌రాబాద్ నుంచి కొన్నాళ్లు బ‌హిష్క‌రించ‌డం కూడా జ‌రిగింది.

అయితే.. ఉన్న‌ట్టుండి ఆయ‌న రోడ్డు ప్ర‌మాదానికి గుర‌వ‌డం.. రోజుల త‌ర‌బ‌డి ప్రాణాల‌తో పోరాడి చివ‌ర‌కు తుదిశ్వాస విడ‌వ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. జూన్ 26న తెల్లవారు జామున నెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క‌త్తి మ‌హేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆయనను నెల్లూరు హాస్పిటల్ కు నాలుగు గంటల ప్రాంతంలో తరలించారు. అప్పటికే విపరీతమైన రక్తస్రావం జరిగిందని సన్నిహితులు తెలిపారు. నెల్లూరు ఆస్పత్రిలో వైద్యులు ప్రాథమికంగా చికిత్స నిర్వహించిన తరువాత వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితి వివరించారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలాయి. గాయాలే కాకుండా తలలో పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఓ కన్నుకు తీవ్రంగా గాయమైంది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో ఆయనను వెంటిలేటర్ పైకి తరలించామని వైద్యులు వెల్లడించారు.

మెరుగైన చికిత్స కోసం కత్తి మహేష్ ను హాస్పిటల్ కు తరలించిన తరువాత ఆయన శరీరంలో పలు రకాల సమస్యలు వెలుగు చూశాయని స్నేహితులు తెలిపారు. ఇటీవల ఆయన ఊపిరితిత్తుల్లోరక్తం గడ్డ కట్టడం (పల్ మనరీ ఎంబోలిజం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సమస్యను పరిష్కరించే దిశగా వైద్యులు చికిత్స ప్రారంభించారు. సమస్య జఠిలం కావడంతో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అయితే.. క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణించ‌డంపై సోష‌ల్ మీడియాలో రెండు వ‌ర్గాలుగా చీలిపోయి విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. దేవుడిని తిట్ట‌డం వ‌ల్ల‌నే ప్రాణాలు పోయాయంటూ కొంద‌రు రామ భ‌క్తులు పోస్టులు పెడుతున్నారు. మ‌రికొంద‌రు త‌మ హీరోను తిట్టినందుకు త‌గిన శాస్తి జ‌రిగింద‌ని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ విష‌య‌మై వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు.

‘‘అంద‌రూ వెన‌కా, ముందూ పోవాల్సిన వాళ్లే. క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణాన్ని కూడా పండ‌గ‌లా జ‌రుపుకునే వాళ్ల‌కు నా ఆన్స‌ర్‌. రేపో ఎల్లుండో మీరు కూడా పోతారు. మీ హీరో కూడా పోతాడు. మీరేదో యుగ‌పురుషుల్లాగా ఎందుకురా పోజులు బుర్ర అప్పుడ‌ప్పుడు వాడండి. క‌త్తి మ‌హేష్ ఆత్మ‌కు శాంతి చేకూరాలి.’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు శ్రీరెడ్డి. ఇది చూసిన కొంద‌రు ‘నెక్స్ట్ నువ్వే’ అని కామెంట్ చేస్తున్నారు.