
సమాజంలో అసమానతలు ఏర్పడడంతో పాటు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో ప్రధాన సమస్యలకు జనాభా పెరుగుదలే కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాభానియంత్రణకు రూపొందించిన నూతన విధాన వివరాలను వెల్లడించారు. 2026నాటికి రాష్ట్రంలో జనన రేటు ప్రతి వెయ్యి జనాభాకు 2.1 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. యూపీ లా కమిషన్ రూపొందించిన జనాభా బిల్లు ముసాయిదా వివరాలను ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదివారం విడుదల చేశారు.