https://oktelugu.com/

Viral Photo: పిక్ ఆఫ్ ది డే : ఎన్టీఆర్ , రాంచరణ్ లతో మహేష్ సరదా కామెడీ.. వైరల్…

మిగితా హీరోల పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ముగ్గురు మాత్రం తరచు కలుసుకుంటూ ఉంటారు ఒకరు ఇంటికి మరొకరు డిన్నర్ కి వాస్తు ఉంటారు. అలా కలిసినపుడు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2023 / 11:32 AM IST

    Viral Photo

    Follow us on

    Viral Photo: తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఒకే వేదికపై కనిపిస్తే ఆనందపడే అభిమానులు చాలామంది ఉన్నారు.కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో స్టార్ హీరోలు ఒకే వేదిక పైన కనిపించే అవకాశం లేకుండా పోయింది.కానీ దానికి భిన్నంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు త్రిబుల్ ఆర్ సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఇదిలా ఉంటే మిగితా హీరోల పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ముగ్గురు మాత్రం తరచు కలుసుకుంటూ ఉంటారు ఒకరు ఇంటికి మరొకరు డిన్నర్ కి వాస్తు ఉంటారు. అలా కలిసినపుడు ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

    దానివల్ల అభిమానుల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ముగ్గురి అభిమానులు కూడా వాళ్ల అభిమానాన్ని చాటుతూ ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచి అండర్ స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నారు.ఇక ఇతర హీరోలు కూడా వీళ్ళలాగే అండర్ స్టాండింగ్ తో ఉంటే బాగుంటుందని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    అయితే రీసెంట్ గా ఒక ఈవెంట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ముగ్గురు కలుసుకున్నారు. దాంతో మహేష్ బాబు వేసిన జోక్ లకి ఎన్టీఆర్,రామ్ చరణ్ పగలబడి నవ్వుతూ ఉండడం మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ముఖ్యంగా మహేష్ బాబు సైలెంట్ గా ఉంటాడు కానీ జోక్స్ మాత్రం చాలా బాగా వేస్తాడు అంటూ చాలామంది నటీనటులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే సెట్లో కూడా అందరి మీద చాలా కామెంట్స్ చేస్తూ షూటింగ్ వాతావరణం మొత్తాన్ని చాలా ఆహ్లాదం గా మారుస్తాడు అని చాలామంది నటి నటులు చెబుతూ ఉంటారు.ఇక ఈ పిక్ లో కూడా మహేష్ బాబు వేసిన పంచ్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్ నవ్వుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో పిక్ అప్ ది డే గా వైరల్ అవుతుంది.

    ఇక ఇది ఇలా ఉంటే వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ల ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు ఎంత బిజీగా ఉన్నా కూడా తరచూ కలుసుకుంటూ ఒకరి సినిమా కి సంభందించిన అప్డేట్స్ మరొకరు తెలియజేస్తూ ఎవరెవరు ఏ సినిమా చేస్తున్నారనే దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటారు అనే విషయాలైతే చాలా సార్లు స్పష్టమైంది..