Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ప్రస్తుతం మహేష్ బాబు వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగిన వారే కావడం విశేషం…అయితే కృష్ణ పెద్దకొడుకు అయిన రమేష్ బాబు మహేష్ బాబు కంటే ముందే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయినప్పటికి ఆయన కొన్ని సినిమాల్లో కనిపించి ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో సినిమాలు చేయడం మానేశాడు..ఇక ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాలను సాధించడమే కాకుండా సూపర్ స్టార్ గా కూడా అవతరించాడు. మరి ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా చేసిన అతిధి, దూకుడు లాంటి సినిమాలకి రమేష్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగిన కృష్ణ తన నట వారసులతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించినప్పటికి మహేష్ బాబు మాత్రమే స్టార్ హీరోగా వెలుగొందడం విశేషం… ఇక ఇప్పుడు రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి హీరోగా ఆయన ఇండస్ట్రీలో నిలబడతాడా లేదా అనే విషయం పక్కన పెడితే మహేష్ బాబు తన ఎంట్రీ కి సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకున్నట్టుగా తెలుస్తోంది…
ఇక జయకృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి కొన్ని కథలను కూడా మహేష్ బాబు వింటున్నాడట. ఇక దర్శకులను కూడా ఎంచుకునే పనిలో మహేష్ బాబు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మహేష్ బాబు తో ‘సర్కార్ వారి పాట’ సినిమాను తీసిన పరుశురాం ఈ సినిమాను చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న సినిమాకు సంబంధించిన విషయాలను చూసుకుంటూనే అటు జయకృష్ణ కెరియర్ కు సంబంధించిన విషయాలను కూడా తనే దగ్గరుండి చూసుకోవడం విశేషం…
మరి సూపర్ స్టార్ కృష్ణ అలాగే మహేష్ బాబు అన్న అయిన రమేష్ బాబు కూడా లేరు కాబట్టి ఆయన పిల్లల బాధ్యతను మహేష్ బాబు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా జయకృష్ణ స్టార్ హీరోగా మారి ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక హీరోగా ఎదుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇప్పటికే మహేష్ బాబు వాళ్ళ అక్క కొడుకు అయిన అశోక్ గల్లా కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా రానిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు జయకృష్ణ కూడా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇంట్రడ్యూస్ అవ్వడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి వీరిలో ఎవరు స్టార్ హీరోగా మారతారనేదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది…