Karthikeya 3: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘కార్తికేయ 3’ని కూడా గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ సీక్వెల్ ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. కాగా ఈసారి ఏకంగా 3Dలో విడుదల చేయనున్నారని టాక్ నడుస్తోంది.

మొత్తానికి నిజాయితీతో హిట్ కొట్టాడు నిఖిల్. కార్తికేయ 2తో సూపర్ హిట్ కొట్టాక కూడా మీడియా మాయలో కొట్టుకుపోవాలనుకోలేదు. సక్సెస్ అందుకున్న హీరోనే అయినప్పటికీ.. నిర్మాతల అడ్వాన్స్ లకు తలొగ్గలేదు. పైగా ‘కార్తికేయ 2’ హిట్ కి కారణం తన గొప్పతనం కాదు, సినిమా కథకు ఉన్న కెపాసిటీ అది అని సగర్వంగా చెప్పాడు. గ్రాఫిక్స్ స్వర్గంలో తేలియాడకుండా నిజాయితీగా నేల మీదే ఉన్నాడు.
అన్నిటికీ మించి తన సినిమా కలెక్షన్స్ విషయంలో ఎంతో నిఖ్ఖచ్చి గా ఉన్నాడు. అసలు ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన కార్తికేయ 2, అన్ని కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ?, ఇదే పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అయినా షాకింగ్ విషయం. మొత్తమ్మీద పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేశాడు. అసలు కార్తికేయ 2 బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
సినిమాలో నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఒక తెలుగు యంగ్ హీరో సినిమా ప్రవాహంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కొట్టుకుపోవడం అంటే.. ఎన్నడూ ఊహించని విషయమే. లాభాల పరంగా చూసుకుంటే.. అమిర్ లాల్ సింగ్ చడ్డా కంటే డబుల్, అక్షయ్ రక్షాబంధన్ కంటే త్రిబుల్ హిట్ ను ఈ సినిమా సాధించింది. ఇది బాలీవుడ్ కే షాకింగ్.

ఇక టాలీవుడ్ లో కూడా ‘కార్తికేయ 2’ చాలా షాక్ లు ఇచ్చింది. ‘కార్తికేయ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంటే.. రవితేజ రామారావు క్లోజింగ్ కలెక్షన్స్ తక్కువ. ఆచార్య లాంగ్ రన్ కలెక్షన్స్ కంటే.. ‘కార్తికేయ 2’ 18 రోజుల కలెక్షన్స్ ఎక్కువ. అసలు మెగాస్టార్ ఆచార్య సినిమా కలెక్షన్స్ ను ఒక చిన్న హీరో సినిమా రాబడట్టం నిజంగా గ్రేటే.
ఇక ‘RRR’ మూవీ ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. ఒక సినిమాకు ఆస్కారే. అతి పెద్ద విజయం కాదు. ప్రజల ప్రేమ, అభిమానం పొందడమే ఒక చిత్రానికి ఆస్కార్ ను మించిన అవార్డు. మన సినిమాలకు ఆస్కార్ ఎందుకు? మన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. నేను స్పెయిన్ లో ‘RRR’ చూస్తే థియేటర్లన్నీ నిండి ఉన్నాయి. అదీ తెలుగు సినిమా సత్తా’ అని నిఖిల్ అన్నాడు.