https://oktelugu.com/

Mahesh Babu – RGV : మహేష్ బాబు ఆర్జీవీ కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీదనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది. అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 12:35 PM IST

    Mahesh Babu's missed movie in RGV combo

    Follow us on

    Mahesh Babu – RGV : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మూస ధోరణిలో సాగుతున్న సినిమాలను పక్కనపెట్టి తనకంటూ ఒక స్టైలిష్ మేకింగ్ తో ప్రేక్షకులందరిని అలరించిన దర్శకుడు ‘రామ్ గోపాల్ వర్మ’…’ నాగార్జున’ తో చేసిన ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ఏకైక దర్శకుడిగా కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చాలామంది యంగ్ దర్శకులకు సైతం ఆదర్శంగా నిలిచాడు. ఆయనను చూసి చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో డైరెక్టర్లు గా మారారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇలాంటి డైరెక్టర్ గత కొన్ని రోజుల నుంచి వరస్ట్ సినిమాలను చూస్తూ వస్తున్నప్పటికీ ఆయన ఒక మంచి కథ తో సినిమా తీస్తే ఇప్పటికి కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకునే సత్తా ఉన్న దర్శకుడు కావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇండస్ట్రీలో నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. అలాగే సుమంత్ ను ‘ప్రేమకథ’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు. ఇక ఇప్పటికి కూడా సుమంత్ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆర్జీవి మహేష్ బాబు తో కూడా ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సినిమాని చేయాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నిజానికి ‘రాజకుమారుడు’ సినిమా తర్వాత మహేష్ బాబు రామ్ గోపాల్ వర్మతోనే ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల అది సెట్ అవ్వలేదు.

    దానికి కారణం ఏంటి అంటే వర్మ చెప్పిన కథ కృష్ణ గారికి నచ్చలేదట.దాంతో కృష్ణ ఇంకొక స్టోరీ రెడీ చేసుకోమని చెప్పగా, వర్మ ఈ కథతో అయితేనే నేను సినిమా చేస్తాను లేదంటే చేయను అని చెప్పారట. అందువల్లే వీళ్ళ ప్రాజెక్టు అనేది తెర మీదకి రాలేదు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో కనుక సినిమా వచ్చుంటే నిజానికి ఆ సినిమా మంచి విజయాన్ని సాధించేది అంటూ ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు ఆర్జీవి అభిమానులు అందరూ కూడా ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనేవి చాలా ఎక్సైటింగ్ గా అనిపించినప్పటికీ అవి వర్కౌట్ అవ్వవు. అలాంటి వాటిలో మహేష్ బాబు ఆర్జీవి కాంబినేషన్ కూడా ఒకటని మనం చెప్పుకోవడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక మహేష్ ఆర్జీవీ తో సినిమా చేయకపోయిన ఆయన కెరీర్ మొదట్లో తేజ, కృష్ణవంశీ, గుణశేఖర్ లాంటి స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేశాడు. అలాగే వీళ్ళందరూ కూడా ఆర్జీవి శిష్యులు కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే మరోసారి మహేష్ బాబు ఆర్జీవీ కాంబినేషన్ అనేది తెరపైకి రాలేదు…ఇక మొత్తానికైతే ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో కూడా భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు.

    ఇక దానికోసమే తీవ్రమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీదనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుంది. అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…