Mahesh Babu Varanasi Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు టాప్ పొజిషన్ కి వెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం విపరీతంగా కష్టపడి తను చేసిన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. అందుకే ఆయన డైరెక్షన్ లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి స్టార్ హీరో ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఒకదానిని మించి మరొకటి సూపర్ సక్సెస్ ని సాధించడం వల్ల ఆయనకు ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుపుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి సంబంధించిన ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. ఆయన ఎద్దు మీద కూర్చొని చేతిలో త్రిశూలం పట్టుకుని చాలా అగ్రెసివ్ గా ముందుకు వస్తున్న ఒక వీడియో రిలీజ్ అయింది.
ఆ వీడియోని చూసిన ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమాని పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పటివరకు మహేష్ బాబు అంత మాస్ లుక్ లో ఎప్పుడూ కనిపించలేదు. అలాంటి మహేష్ బాబుని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి రాజమౌళి చేస్తున్న ప్రయోగం అద్భుతంగా వర్కౌట్ అయ్యే విధంగానే కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఆ లుక్ బయటికి వచ్చిందో లేదో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సాక్ష్యం’ సినిమాలోని నుంచి ఆ వీడియో ను కాపీ చేశారు అంటూ కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో ఎద్దు మీద కూర్చొని అలాగే ముందుకు వచ్చే ఒక వీడియోని షేర్ చేస్తూ రాజమౌళి కాపీ చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ కాపీ కామెంట్స్ మీద ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
