‘గంటా’కు కలిసొచ్చిన స్టీల్ ప్లాంటు ఉద్యమం..

టీడీపీ, కాంగ్రెస్, చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్యేగా ఉండి కూడా.. సైలెంట్ అయి పోయారు. మంత్రిగా చేసిన అనుభవం ఉన్న శ్రీనివాసరావు.. రాజకీయాల్లో సీనియర్ నాయకులు. అయితే కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రాజీనామా పేరుతో మళ్లీ ప్రజల నోళ్లలో నానుతున్నారు. Also Read: కొడాలి నాని.. వివాదాస్పద వ్యాఖ్యల ఖని..! మాజీ మంత్రి గంటా […]

Written By: Srinivas, Updated On : February 7, 2021 5:13 pm
Follow us on


టీడీపీ, కాంగ్రెస్, చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎమ్మెల్యేగా ఉండి కూడా.. సైలెంట్ అయి పోయారు. మంత్రిగా చేసిన అనుభవం ఉన్న శ్రీనివాసరావు.. రాజకీయాల్లో సీనియర్ నాయకులు. అయితే కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రాజీనామా పేరుతో మళ్లీ ప్రజల నోళ్లలో నానుతున్నారు.

Also Read: కొడాలి నాని.. వివాదాస్పద వ్యాఖ్యల ఖని..!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు స్టీల్ ప్లాంటు పరిరక్షణ ఉద్యమాన్ని వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. తన పదవికి చెల్లని రాజీనామా చేసి.. అందరూ అలాగే చేయాలని పిలుపు సైతం ఇచ్చారు. అంతేకాదు.. రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. దానికి తానే నాయకత్వం వహించాలని కూడా ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇతర నేతలను కూడా రాజీనామా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ ఆమోదం పొందడమే.. కష్టం. తన రాజీనామ లేఖను లేటర్ ప్యాడుపై స్వయంగా రాసి పంపించారు. అందులో తాను స్టీల్ ప్లాంటు పరిక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయాలంటే.. దానికో ఫార్మట్ ఉంటుంది. లేఖలో ఎలాంటి కారణాలు చెప్పకూడదు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఒక్కవాఖ్యంలో వివరించాలి. కానీ గంటా శ్రీనివాస రావు తాను స్టీల్ ప్లాంటు ఉద్యమం కోసం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రాశారు. అది సాంకేతికంగా చెల్లుబాటు కాదు. ఈ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని పలువురు అంటున్నారు.

Also Read: ఆ మూడు గంటల్లో ఏం జరిగింది..? : పెద్దిరెడ్డిలో ఎందుకీ మార్పు

అయితే గంటా శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా రాజీనామా చేయలేదని.. రాజకీయ కోణంలోనే రాజీనామా చేశారని.. లేఖను పరిశీలించిన ఎవరికైనా అర్థం అవుతుంది. తగ రెండేళ్లుగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. టీడీపీలో ఐదేళ్లు మంత్రిగా పని చేసినప్పటికీ.. 2019లో పార్టీ ఓడిపోయి.. తాను గెలిచినా.. అదికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక సైలెంట్ అయ్యారు. బీజేపీలో చేరలేకపోయారు. వైసీపీకి వెళ్లేందుకు సిద్ధం అయినా.. అతడ్ని వ్యతిరేకించే వర్గం బలంగా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఆయన తన రాజకీయ ఉనికి ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ నిర్ణయం కలిసి వచ్చేలా చేసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్